Sunday, July 20, 2025
spot_img

’25 ఇయర్స్ ఆఫ్ శేఖర్‌ కమ్ముల’

Must Read

సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టోరీ టెల్లింగ్

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల అని అభినందించిన మెగాస్టార్ చిరంజీవి

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ శేఖర్‌ కమ్ముల సినీ ఇండస్ట్రీలో 25 ఏళ్లు విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ ప్రత్యేక సందర్భంలో మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. ఈ సందర్భంగా ’25 ఇయర్స్ ఆఫ్ శేఖర్‌ కమ్ముల’ సెలబ్రేటింగ్ ది సోల్ ఆఫ్ స్టొరీ టెల్లింగ్ పోస్టర్ ని మెగాస్టార్ చిరంజీవి లాంచ్ చేసి ఆయన్ని అభినందించారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ శేఖర్‌ కమ్ముల సోషల్‌మీడియా వేదికగా పోస్ట్‌ చేశారు. ”టీనేజీలో ఒక్కసారి చిరంజీవి గారిని దగ్గరగా చూశాను. ‘ఈయనతో సినిమా తీయాలి’ అనే ఫీలింగ్. అంతే. నేను ఇండస్ట్రీకి వచ్చి 25 ఇయర్స్ . ‘లెట్స్ సెలబ్రేట్’ అని మా టీమ్ అంటే నాకు గుర్తొచ్చింది చిరంజీవిగారే. కొన్ని జెనరేషన్స్‌ని ఇన్‌స్పైర్ చేసిన పర్సనాలిటీ ఆయన. ‘ఛేజ్ యువర్ డ్రీమ్స్.. సక్సెస్ మనల్ని ఫాలో అయి తీరుతుంది’ అన్న నమ్మకం ఇచ్చింది చిరంజీవి గారే. సో, నా 25 ఇయర్స్ జర్నీ సెలబ్రేషన్ ఆయన సమక్షంలోనే చేసుకోవాలి అనిపించింది. థ్యాంక్యూ సార్. ఈ మూమెంట్‌లోనే కాదు, నా టీనేజ్ నుండి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు’ అని శేఖర్‌ కమ్ముల రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫొటోలను అభిమానులతో పంచుకున్నారు.

ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఆనంద్‌, ‘గోదావరి’, ‘హ్యాపీ డేస్‌’, ‘లీడర్‌’, ‘ఫిదా’ ‘లవ్‌ స్టోరీ’ లాంటి కల్ట్ క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నారు శేఖర్‌ కమ్ముల. ప్రస్తుతం ధనుష్‌, నాగార్జున హీరోలుగా పాన్ ఇండియా మూవీ ‘కుబేర’తో అలరించడానికి రెడీ అయ్యారు. జూన్ 20న తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషలలో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS