Sunday, July 20, 2025
spot_img

జనాలను ముంచిన ఆర్‌.జె.వెంచర్స్‌

Must Read

రూ.270 కోట్ల కుచ్చుటోపీ

కంపెనీ అధినేతలు భాస్కర్‌ చక్కా, సుధారాణి చక్కాల మాయజాలం

˜ ఖతర్నాక్‌ కపుల్స్‌ చేసిన అవినీతి భాగోతం..
˜ 1000 మంది అమాయకులను
మోసం చేసిన వైనం..
˜ లబో దిబో మంటున్న ఆర్‌.జె. వెంచర్స్‌
బాధితులు.. ˜ న్యాయం జరక్కపోతే
ఆత్మహత్యే శరణ్యం అంటూ రోదనలు..
˜ ప్రభుత్వాలు, అధికారులు ఇలాంటి వారిని
కట్టడి చేయలేరా..? ˜ గుంట భూమి
ఉండదు.. నిర్మాణాలు అసలే ఉండవు..
˜ కేవలం బ్రోచర్లలో మాత్రమే చూపిస్తూ దగా చేస్తారు..
˜ ఆఫర్ల పేరుతో అమాయకుల ఉసురు తీస్తారు..
˜ అక్రమార్జనే పరమావధిగా సాగిపోతున్న ప్రీ లాంచ్‌
మోసాల పై అనునిత్యం అక్షర యుద్ధం చేస్తున్న ‘ఆదాబ్‌’..

వద్దురా బాబూ ఈ ప్రీ లాంచ్‌ ఆఫర్లకు ఆకర్షితులై జీవితాలు నాశనం చేసుకోకండి.. మీ పిల్లల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేయకండి.. జాగ్రత్త వహించండి అంటూ నెత్తి నోరూ కొట్టుకుని మొత్తుకుంటున్నా జనాల్లో మార్పు రావడం లేదు.. పుంఖాను పుంఖాలుగా సామాజిక బాధ్యతతో ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘ ప్రీ లాంచ్‌ మోసాలపై కథనాలు రాస్తున్నా ప్రజల్లో చైతన్యం రావడంలేదు.. ఇదే కాకుండా ప్రీ లాంచ్‌ పేరుతో దోచుకుంటున్న దగాకోరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులపై ప్రభుత్వం కూడా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.. వేలాది మంది అమాయకులు రోడ్డున పడి రోధిస్తున్నా.. మోసపోయి ప్రాణాలు తీసుకుంటున్నా ప్రభుత్వం కనికరించడం లేదు.. అసలు రాష్ట్రంలో ఏమి జరుగుతోంది..? ప్రభుత్వం గానీ, ప్రభుత్వాధికారులు గానీ ఎందుకు స్పందించడం లేదు.. అవినీతిని ఉక్కు పాదాలతో తొక్కి పెడతామని, రాష్ట్ర ప్రజల్లో ఏఒక్కరికీ అన్యాయం జరిగినా సహించబోమని బీరాలు పలుకుతున్న సర్కార్‌ కు ఇలాంటి సంఘటనలు కనిపించడం లేదా..? అసలు ప్రీ లంచ్‌ అన్నది చట్ట వ్యతిరేకమని తెలియదా..? లేని భూమిని బ్రోచర్లలో చూపించి.. అమాయకులకు ఆఫర్లనే గాలం వేస్తూ తమవైపుకు లాక్కుంటున్న సంస్థలు ఎన్నో ఉన్నాయి.. తీరా తాము వలలో చిక్కుకున్నామని తెలిసిన తర్వాత లబో దిబో అంటున్నారు బాధితులు.. ప్రీ లంచ్‌ పేరుతో జనాల నెత్తిన కుచ్చుటోపీ పెట్టిన ఖతర్నాక్‌ కపుల్‌ అవినీతి చరిత్ర ఇది.. ఆర్‌ జె వెంచర్స్‌ పేరుతో వందకోట్లకు పైగా కొల్లగొట్టిన ఘరానా కథనం ఇది.. వీరు ప్రజల నుండి అక్రమంగా కొట్టేసిన డబ్బులతో బినామీల పేరు మీద భూముల చిట్ట బటయపెట్టి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం…


హైదరాబాద్‌, 30 మే (ఆదాబ్‌ హైదరాబాద్‌) :లక్షల మంది కన్నీటి సంద్రంలో మునిగిపోతూ ప్రాణాలను తీసుకుంటున్న ప్రీ లాంచ్‌ మోసాలను ఎన్నింటినో చూస్తున్నాం.. వేల కోట్లు కొల్ల గొడుతూ.. కేసులు నమోదైనా కోర్టుల నుంచి బెయిల్‌ పొందు తూ తాము సంపాదించిన అక్రమార్జనతో జల్సాలు చేస్తున్న రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలను చూస్తున్నాం.. అయినా పరిస్థితుల్లో ఎలాంటి మార్పు రావడం లేదు.. ప్రీ లాంచ్‌ ఆఫర్లు అనగానే ఎగరేసుకుంటూ వెళ్తున్న అమాయకులను ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం. రేయింబవళ్లు రెక్కలు ముక్కలు చేసుకుని, రక్తం ధారపోసి సంపాదించిన పైకాన్ని ఇలాంటి రియల్‌ మోసగాళ్ల చేతుల్లో పోస్తున్నారు.. మోసపోయామని గ్రహించాక ప్రాణాలు తీసుకుంటున్నారు.. ప్రీ లాంచ్‌ అన్నది చట్ట విరుద్ధమైనా ఈ వ్యవహారాలకు కళ్లెం పడటం లేదు.. ఎన్నుకున్న ప్రభుత్వాలు కూడా ఈస్ట్‌ మన్‌ కలర్‌ సినిమా చూస్తున్నట్లు జరుగుతున్న వ్యవహారాలను చూస్తూ మిన్నకుండి పోతున్నాయి తప్ప వాటిని కట్టడి చేయడానికి మాత్రం ప్రయత్నించడం లేదు.. ఎందుకు ఇలా జరుగుతోంది.. కోట్లలో కొల్లగొడుతూ.. తమపై నమోదైన కేసులను కోర్టుల్లో సవాలు చేస్తూ బెయిల్‌ పొందుతూ దర్జాగా బ్రతికేస్తున్నారు రియల్‌ మోసగాళ్లు.. కానీ వాళ్ళ చేతుల్లో మోసపోయిన అమాయకులకు దారి చూపించే వారు ఎవరూ లేరు..

పోగొట్టుకున్న డబ్బులు వసూలు చేసుకోలేక.. కోర్టుల నుంచి, ప్రభుత్వాల నుంచి న్యాయం జరగక.. చావలేక బ్రతుకులు ఈడుస్తున్న వారు కొందరైతే.. జరిగిన మోసం తట్టుకోలేక ప్రాణాలు తీసుకుంటున్నవారు ఎందరో..? ప్రస్తుతం ఆర్‌.జె. వెంచర్స్‌ అనే రియల్‌ ఎస్టేట్‌ సంస్థ కూడా ఘరానా మోసానికి తెరలేపింది.. ప్రీ లాంచ్‌ అంటూ దాదాపు 1000 మంది అమాయకులను అడ్డాంగా మోసం చేసి, దాదాపు 270వంద కోట్ల రూపాయలకు పైగా వెనుకేసుకుంది.. భార్యా భర్తలు ఇద్దరూ కలిసి ఈ వ్యవహారం నడిపారు.. అయితే ఈ దగాకోరు దంపతులు అరెస్ట్‌ అయ్యారని తెలిసింది.. అయితే ఏమిటి లాభం..? కేసు కోర్టుకు వెళ్తుంది.. వాదోపవాదాలు జరు గు తాయి.. తాము సంపాదించిన అక్రమార్జనలో కొంత డబ్బును వెదజల్లుతారు.. బెయిల్‌ తెచ్చుకుంటారు.. ఎంచక్కా నగరం దాటి ఎక్కడికో వెళ్ళిపోతారు.. నొక్కేసిన డబ్బులతో జల్సాలు చేస్తారు.. ఇదే జరగబోతోంది.. మరి వారి చేతుల్లో మోసపో యిన వారి మాటేమిటి..? వారికి న్యాయం జరిగేది ఎప్పుడు..? పోగొట్టుకున్న డబ్బులు వారికి తిరిగి వచ్చేది ఎప్పుడు..? ఈ లోగా కేసు నడుస్తూనే ఉంటుంది.. కాలం గడిచి పోతూనే ఉంటుంది.. ఈలోపు ఓపిక నశించిన కొందరు బాధి తులు చేసేది ఏమీ లేక తమ దైనందిన జీవితంలో మళ్ళీ చెమటో డ్చడానికి వెళ్ళిపోతారు.. కొందరు సమాజంలో తలెత్తుకోలేక, చేసిన అప్పులు తీర్చలేక ప్రాణాలు తీసుకుంటున్నారు..


కాగా ఆర్‌.జె. వెంచర్స్‌ అధినేతలు భాస్కర్‌ చక్కా, సుధారాణి చక్కా అనే దంపతులు ఆర్‌.జె. గ్రూప్‌ పేరుమీద .. జై వాసవీస్‌ ఓ ఆర్‌ ఆర్‌ హైట్స్‌, జనతా ఎస్టేట్స్‌ గోల్డెన్‌ విలేజ్‌, జై వాసవి హైట్స్‌ అంటూ రకరకాల పేర్లతో వెంచర్స్‌ వేస్తున్నామంటూ నమ్మబలికి.. కస్టమర్లను ఆకర్షించి.. వారికి విందుభోజనాలు ఏర్పాటు చేసి, హంగు ఆర్భాటాలు చూపించి అరచేతిలో స్వర్గాన్ని దర్షింపజేసి.. వారితో డబ్బులు కట్టించుకున్నారు.. అగ్రిమెంట్స్‌ చేశారు.. ఇవన్నీ గుడ్డిగా నమ్మిన అమాయకపు జనాలు తమ కష్టార్జితాన్ని ఈ ఖతర్నాక్‌ కపుల్‌ చేతుల్లో పోసేశారు.. ఇంకేముంది ఈ ఇద్దరు దంపతులు తెలివిగా జెండా ఎత్తేశారు.. తీరా తాము మోసపోయామని తెలుసుకున్న బాధితులు అందరూ కలిసి ఒక గ్రూప్‌ గా అంటే ఆర్‌.జె. వెంచర్స్‌ బాధితుల సంఘంగా ఏర్పడి.. పోలీసులకు ఫిర్యాదు చేయడం.. రోడ్డెక్కి పోరాటాలు చేయడం మొదలు పెట్టారు.. చేతులు కాలాక ఆకులు పట్టుకుని ఏమి లాభం.. మొత్తానికి పోలీసులు ఈ దగాకోరు దంపతులను అదుపులోకి తీసుకున్నారు.. కేసు నడుస్తోంది.. అయితే బాధితులకు న్యాయం జరుగుతుందనే గ్యారెంటీని ఎవరు ఇవ్వగలరు..? న్యాయస్థానం హామీ ఇస్తుందా..? పోలీసులు భరోసా ఇస్తారా..? ప్రభుత్వం అండగా ఉంటుందా..? అధికారులు సహాయం చేస్తారా..? అన్నది జవాబు లేని ప్రశ్నగా మిగిలిపోయింది..

తాము నమ్మి మోసపోయామని.. తమ డబ్బులు తమకు ఇప్పించాలని ప్రభుత్వానికి మొరపెట్టుకుంటున్నారు బాధితులు.. ఇన్ని మోసాలు జరుగుతున్నా బండరాయి మీద భారీ వర్షం కురిసినట్లు వ్యవహరిస్తున్న ప్రభుత్వం, అధికారులు ఇప్పటికైనా వారికి న్యాయం చేసి, వారి డబ్బులు వారికి ఇప్పించి, మరోసారి ఇలా ప్రీ లాంచ్‌ మోసాలు జరక్కుండా మరింత కఠినమైన చట్టాలు అమలు చేయాలని.. ఏ ఒక్కరు కూడా మోసపోకుండా చూడాలని బాధితులు కోరుతున్నారు.. అలాగే అమాయకులైన బాధితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు సామాజిక వేత్తలు.. ఈ బాధితులకు న్యాయం జరిగి వారి పైకం వారికి చేరేంత వరకు వారికి అండగా ఉంటామని ఆదాబ్‌ తెలియజేస్తోంది.. అవసరమైతే న్యాయపోరాటానికి సైతం సిద్ధం అవుతామని హెచ్చరిస్తోంది.. ‘ ఆదాబ్‌ హైదరాబాద్‌ ‘.. ‘ మా అక్షరం అవినీతిపై అస్త్రం ‘..

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS