Sunday, July 20, 2025
spot_img

ప్రధానోపాధ్యాయులలోకెళ్ల ఉత్తముడు

Must Read
  • ఐటి కట్టలేదని రెండుసార్లు ఐటి కట్టించిన ప్రధానోపాధ్యాయుడు..
  • రూ.40 వేలు మహిళా ఉపాధ్యాయురాలుకి తిరిగి ఫోన్ పే..
  • మరుగుదొడ్లు కడిగే స్కైవెంజర్ జీతం ఆపిన పిల్లుట్ల..
  • ఇంగ్లీష్ టీచర్ వి రెండు సంవత్సరాలుగా ఇంక్రిమెంట్లు నిలిపివేత..
  • ప్రధానోపాధ్యాయుడు పై ఉన్నతాధికారుల విచారణ షురూ..
  • పిల్లుట్ల శ్రీహరి పై పలు సెక్షన్ల కింద ఎస్సీ ఎస్టీ కేసు నమోదు..
  • జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసిన ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం..
  • హెడ్మాస్టర్ శ్రీ హరి ని సస్పెండ్ చేయాలని డిమాండ్.

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం, నెమ్మికల్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిరిజన మహిళ ఉపాధ్యాయురాలుని ఆ స్కూల్ హెడ్మాస్టర్ పిల్లుట్ల శ్రీహరి వేధింపులకు గురి చేస్తున్నట్లు ఈనెల 16న ఆదాబ్ హైదరాబాద్ దినపత్రికలో “శ్రీహరి నీకు ఇదేం పాడు బుద్ధి” అనే వార్త కథనం ప్రచురించడం జరిగింది. ఈ కథనంపై జిల్లా, రాష్ట్రవ్యాప్తంగా అనూహ్యమైన స్పందన వచ్చింది. గత నెల రోజుల క్రితం గిరిజన ఉపాధ్యాయులు తనను, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వేధింపులకు గురి చేస్తున్నారని జిల్లా విద్యాశాఖ అధికారికి ఫిర్యాదు చేసినప్పటికీ,జూలై 15 వరకు స్పందించని అధికారులు, ఆదాబ్ లో వెలువడిన కథనంతో జిల్లాలోని సంబంధిత శాఖల అధికారులతో పాటు, పోలీస్ అధికారులు సైతం విచారణ చేపట్టి, కథనం వెలువడిన 24 గంటల్లోనే ఆ ఉత్తమ ప్రధానోపాధ్యాయుడిపై, సి.ఆర్ నెంబర్ 148/2025, యు/సెక్షన్ 79 బి ఎన్ ఎస్ – 2023 (509 ఐపిసి), సెక్షన్ 3 (1)(ఆర్)(ఎస్) ఆఫ్ ఎస్సీ/ఎస్టీ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఉన్నతాధికారులు చాలా సీరియస్ గా తీసుకొని, గత రెండు రోజులుగా స్కూల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులను, హెడ్మాస్టర్ ను సామరస్యంగా విచారణ చేపట్టినట్లు తెలుస్తుంది.

Half day school’s Government order

ఒక్క నిమిషంలో 40 వేలు ఫోన్ పే..
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గిరిజన మహిళ ఉపాధ్యాయురాలుకి జీతం పైసలు చేతికి ఇస్తున్నారు ఏంటి అని ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్నకు, అలా ఏం లేదని జీతం అకౌంట్ లో పడుతుందని, ఐటీ కోసం అమౌంట్ కట్ అయితే, తన సొంత పైసలు ఒక్క నిమిషంలో రూ.40 వేలు ఫోన్ పే చేశానని ప్రధానోపాధ్యాయుడు పిల్లుట్ల శ్రీహరి ఒక యూట్యూబ్ ఛానల్ కు వివరణ ఇచ్చారు. మహిళ ఉపాధ్యాయురాలుకు అయితే ఒక్క నిమిషంలో ఫోన్ పే చేశారు. మరి ఇంగ్లీష్ టీచర్ అయిన నరసరాజు ఏం తప్పు చేశారని రెండు ఇంక్రిమెంట్లు రెండు సంవత్సరాలు ఆపివేశారు.? మీరు చేసిన పని వల్ల సదరు ఉపాధ్యాయుడు సుమారు లక్షల 50 వేల రూపాయలు నష్టపోయారు. మరి ఆ ఉపాధ్యాయుడికి ఒక గంటలోనైనా ఆ అమౌంట్ ఫోన్ పే చేస్తారా.? అలాగే ఐటీ లేటుగా సబ్మిట్ చేశారని ఐదు మంది ఉపాధ్యాయుల శాలరీ లేటుగా చేసి, జీతం అందకుండా చేశారు. వారికి కూడా నాలుగు రూ.4 లక్షలు ఫోన్ పే చేయొచ్చుగా సార్.? ఇంకో విషయం మరుగుదొడ్లు కడిగే స్కైవెంజర్ రాములమ్మ కూడా రూ. 12000 లు జీతం ఆపివేశారు. ఆమెకు కూడా ఒక గంటలో ఫోన్ పే ద్వారా చెల్లించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఉత్తమ ప్రధానోపాధ్యాయుడు డిడిఓ అధికారాలు చేతిలో ఉన్నాయి కదా అని కిందిస్థాయి ఉపాధ్యాయులను, మరుగుదొడ్లు కడిగే పనిమనిషి సైతం జీతాలు ఆపడంలో ఆంతర్యం ఏమిటో.?

పిల్లుట్ల శ్రీహరి తయారుచేసిన హాఫ్ డే స్కూల్స్ ఆర్డర్స్

పిల్లుట్ల వారి సొంత ఆదేశాలు..
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైమరీ, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు అన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలను పాటిస్తుంటారు. కానీ సూర్యాపేట జిల్లా నెమ్మికల్ గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాత్రం ప్రభుత్వ ఆదేశాలు పని చేయవు. ఈ ప్రధానోపాధ్యాయుడు సొంతంగా తన ఆర్డర్స్ సృష్టించి, అవే పాటించాలని కిందిస్థాయి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. తానే హాఫ్ డే స్కూల్ టైం టేబుల్ పేరుతో పిరియడ్స్, లంచ్ బ్రేక్, లాంగ్ బెల్ టైం టేబుల్ నిర్ణయించారు. ఈ సొంత టైం టేబుల్ వల్ల ఆ పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు పీరియడ్స్ సమయ భావంతో చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. అయినా ఈ ప్రధానోపాధ్యాయుడికి పాఠశాలల్లో ఉన్న ఏ ఒక్క ఉపాధ్యాయుడు ఎదురు చెప్పరు. ఎందుకంటే ఈ హెడ్మాస్టర్ ఇక్కడ ఏది చెబితే అది వినాల్సిందే.. చేయాల్సిందే.. లేదంటే వారి జీతాలు ఆపడం, వారి పీరియడ్స్ మార్చడం, కాంప్లెక్స్ మీటింగ్ లకు అవసరం లేకపోయినా పిలవడం, సంబంధిత శాఖ జిల్లా అధికారి సహకారంతో షోకాజులు ఇచ్చి ఉపాధ్యాయులను భయభ్రాంతులకు గురిచేస్తారని స్థానిక ఉపాధ్యాయులు చెప్తున్నారు.

ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి..
ఉపాధ్యాయురాలని మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్న ప్రధానోపాధ్యాయులు శ్రీహరిని వెంటనే సస్పెండ్ చేయాలని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘ్ జిల్లా అధ్యక్షులు నాగు నాయక్ అధికారులను డిమాండ్ చేశారు. జిల్లా విద్యాశాఖ అధికారి అశోక్ వినతిపత్రం అందజేశారు. గిరిజన మహిళ ఉపాధ్యాయురాలు సుకన్యను కావాలని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు పిల్లుట్ల శ్రీహరి మానసికంగా ఇబ్బందులకు గురి చేస్తున్నారని అన్నారు.జిల్లా అధికారులు ఈ విషయంపై సమగ్ర విచారణ చేసి వేధింపులకు పాల్పడుతున్న ప్రధానోపాధ్యాయుని విధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Latest News

త్యాగాలకు అడ్డా హుజూరాబాద్‌

బిఆర్‌ఎస్‌ నుంచి రావడానికి అనేక కారణాలు పదవుల కోసం ఏనాడూ పార్టీ మారలేదు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేకులు కుట్ర కొందరు కడుపులో కత్తులు పెట్టుకుని మాట్లాడుతారు ఇకనుంచి స్ట్రేట్ ఫైట్‌.....
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS