రోజురోజుకు లోన్ యాప్ వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. వీరి వేధింపులు తట్టుకోలేక అనేకమంది ప్రాణాలు తీసుకున్న ఘటనలు ఎన్నో ఉన్నాయి. తాజాగా విశాఖ జిల్లాలో లోన్ యాప్ వేధింపులకు మరో యువకుడు బలి అయ్యాడు. ఈ ఘటన మహారాణిపేట పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. లోన్ యాప్ నిర్వాహకులు రూ.2 వేల కోసం నరేంద్ర ఫోటోలను మార్ఫింగ్ చేసి..పంపడంతో తీవ్ర మనస్తాపానికి గురైనా నరేంద్ర ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.