Thursday, December 12, 2024
spot_img

బడంగ్ పేట్ మున్సిపాలిటీ @ ప్రభుత్వ అధికారి ముసుగులో దొంగలు..

Must Read
  • అంతులేని ఆర్.కె. బిల్డర్స్ అవినీతి అక్రమాలు..
  • సామాన్యులను తడిగుడ్డుతో గొంతు కోస్తున్నా..ఆపే వారే లేరా..!
  • యు.ఎల్.సి. భూమి, దొంగ లేఔట్, తప్పుడు ఎల్ఆర్ఎస్..
  • ఏకంగా మున్సిపల్ అనుమతులతో అక్రమ నిర్మాణాలు..
  • నాలా కన్వర్షన్ కాకుండానే రిజిస్ట్రేషన్లు..
  • దొంగ ఎల్ఆర్ఎస్ కాపీలు పెట్టి నిర్మాణ అనుమతులు..
  • మున్సిపల్, రేరా, రెవెన్యూ లాంటి చట్టానికి తూట్లు పొడుస్తున్న
    బడంగ్ పేట్ ప్రభుత్వ అధికారులు..
  • సబ్ రిజిస్ట్రార్, టిపిఓ, మున్సిపల్ కమిషనర్ పై చర్యలు ఎక్కడ..?
  • ఫిర్యాదులను తొక్కిపెట్టిన బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ సరస్వతి..
  • దొంగలతో దోస్తీ కట్టి అవినీతిని ప్రోత్సహిస్తున్న పరిస్థితి..
  • కోట్ల రూపాయల ప్రభుత్వ పన్ను సొంత జేబుల్లోకి
    మళ్లించుకుంటున్న అవినీతి అధికారులు..
  • స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రంగారెడ్డి కలెక్టర్, రేరా కమిషనర్ ఎమ్.ఎ అండ్ యు.డి కమిషనర్ మున్సిపల్ శాఖ మాత్యులు సీ.ఎం రేవంత్ రెడ్డి దృష్టి సారించాలి..

కొంతమందిని చూస్తే అవినీతి, భయం, సిగ్గు లాంటి పదాలు సైతం తలొంచుకుని పారిపోతుంటాయి.. సమ సమాజంలో తమను తలుచుకోవడానికి అందరూ సంకోచిస్తుంటారు. కానీ అలాంటి తమకే తలవంపులు తెచ్చేలా ప్రవర్తిస్తున్న కొందరు అవినీతి ప్రభుత్వ అధికారుల ప్రవర్తన చూసి ఈ పదాలకు నోట మాట రావడంలేదు. చదవడానికి ఇది కొంచం అతిగా అనిపించినా ఇదే ప్రస్తుతం కొందరు అవినీతి అధికారుల జీవితాలు సరిగ్గా సరిపోతాయి. అవినీతిని తమ నరనరాలా జీర్ణించుకున్నారు బడంగ్ పేట్ మున్సిపల్ అధికారులు..పుంఖాను పుంఖాలుగా వారి అవినీతి చరిత్రను వెలుగులోకి తీసుకుని వచ్చి ప్రచురిస్తున్నా వీరిలో మార్పు రావడం లేదు.. కనీసం చీమ కుట్టినట్లైనా లేదు వాళ్లకి.


బడంగ్ పేట్ మున్సిపాలిటీ అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మారింది అనడంలో అతిశయోక్తి లేదు.. ఇక్కడ అవినీతి మితిమీరింది. దొంగ లేఔట్లు, తప్పుడు ఎల్.ఆర్.ఎస్.లు, యు.ఎల్.సి., ప్రభుత్వ భూముల్లో నిర్మాణ అనుమతులు.. వేల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు.. ఈ అవినీతిపై గతంలో వరుస కథనాలు..పదుల సంఖ్యలో ఫిర్యాదులు..అయినా సరే ఈ అవినీతి అక్రమాలపై చర్యలు తీసుకోకుండా జడ్యాన్ని ప్రదర్శిస్తున్నారు ప్రభుత్వ యంత్రాంగం.

ప్రభుత్వ అధికారి ముసుగులో దొంగలు :
ధనం మూలం ఇదం జగత్..అనే నానుడిని నిజం చేస్తున్న ప్రభుత్వ అధికారులు నేటి కాలంలో లేఅవుట్ వేయాలంటే హెచ్ఎండిఏ డిటిసిపి అనుమతులు తప్పనిసరి ఇవేమీ లేకుండా దొంగ దారిలో తప్పుడు లేఅవుట్లు వేసి తప్పుడు ఎల్ఆర్ఎస్ లు జతపరిచి దొంగ దారిలో బడంగ్ పేట్ మున్సిపల్ కార్యాలయం నుండి నిర్మాణ అనుమతులు తీసుకొని అక్రమ నిర్మాణాలను ప్రోత్సహిస్తూ రేరా చట్టానికి, మున్సిపల్ చట్టానికి పూర్తిగా తూట్లు పొడిచి అటు ప్రభుత్వాన్ని, ఇటు ప్రజలను మోసం చేస్తున్నారు అనడానికి పూర్తి ఆధారాలతో మీముందుకు తీసుకుని వస్తోంది ఈ కథనం.

యు.ఎల్.సి. భూమని తెలుసు.. నాలా కన్వర్షన్ కాలేదు అని తెలుసు. అప్పటి సబ్ రిజిస్టర్ మధుసూదన్ రెడ్డి లక్షల్లో లంచం తీసుకొని రిజిస్ట్రేషన్లు చేశాడు.. ఇప్పటికీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్, ధరణి పోర్టల్ లో ఆధారాలు కనబడుతున్నాయి.. రిజిస్ట్రేషన్ లను ఆధారంగా చేసుకుని అప్పటి బడంగ్ పేట్ మున్సిపల్ కమిషనర్ కృష్ణమోహన్ రెడ్డి ప్రోత్సాహంతో..దొంగ లేఔట్ ఏర్పాటుచేసి, తప్పుడు ఎల్.ఆర్.ఎస్. లు సృష్టించి, లక్షల్లో లంచం తీసుకొని, అక్రమ పద్ధతిలో నిర్మాణ అనుమతులు ఇచ్చారు అనడానికి ఎన్నో ఆధారాలున్నాయి.

బడంగ్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని నాదర్గుల్ విలేజ్, బాలాపూర్ రెవెన్యూ సర్వేనెంబర్ 743, 748లో ఆర్.కె. బిల్డర్స్ పేరుతో గేటెడ్ కమ్యూనిటీలో 30 కొత్త గృహ నిర్మాణాలను నిర్మిస్తూ.. అమాయకులను తడిగుడ్డతో గొంతు కోసే విధంగా, తమ అక్రమ నిర్మాణాలతో అమాయకులైన సామాన్యులకు విక్రయించే ప్రక్రియ నిరాటంకంగా కొనసాగిస్తున్నారు సదరు బిల్డర్స్..సర్వే నెంబర్ 743, 748లో సంబంధిత స్థలం కన్సర్వేషన్ జోన్ లో ఉంది..ఈ స్థలం యు.ఎల్.సి.లో ఉంది..పైగా నాలా కన్వర్షన్ కూడా కాలేదు. కానీ తప్పుడు ఎల్ఆర్ఎస్ రశీదులను పొందుపరిచారు.

హెచ్ఎండిఏ మాస్టర్ ప్లాన్ రోడ్ లోనే నిర్మాణాలు నెలకొన్నాయి..2020లో ఈ స్థలం ఓపెన్ ల్యాండ్ గా ఉంది. 2021, 2022లో రెవెన్యూ రికార్డుల ప్రకారం ఈ భూమి యు.ఎల్.సి.లో ఉంది.. ఎంతో తెలివిగా గ్రామ పంచాయతీ లేఔట్ గా, దొంగ లే అవుట్ ను చిత్రించారు..వక్రమార్గంలో అక్రమంగా, ప్రభుత్వ నిబంధనలకు పూర్తిగా విరుద్ధంగా నిర్మాణ అనుమతులు తీసుకొని.. బ్యాంకు ద్వారా లోన్లు కూడా తీసుకొని అక్రమ నిర్మాణాలు చేపట్టి, సామాన్య జనానికి అమ్మి మోసం చేసే ప్రక్రియ కొనసాగుతూనే ఉంది.

అక్రమ పద్ధతిలో టీఎస్ బిపాస్ ద్వారా వచ్చిన పర్మిషన్ వివరాలు మీముందుకు తెస్తున్నాం :

  1. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246232/బీ.ఏ.డీ.ఏ./4968/2022..
  2. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246236/బీ.ఏ.డీ.ఏ./4969/2022.
  3. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246261/బీ.ఏ.డీ.ఏ./4972/2022..
  4. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246322/బీ.ఏ.డీ.ఏ./4979/2022..
    5.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246309/బీ.ఏ.డీ.ఏ./4978/2022.
  5. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246301/బీ.ఏ.డీ.ఏ./4977/2022.
  6. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246294/బీ.ఏ.డీ.ఏ./4976/2022.
  7. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246285/బీ.ఏ.డీ.ఏ./4975/2022.
  8. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246267/బీ.ఏ.డీ.ఏ./4973/2022.
  9. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/ 246326/బీ.ఏ.డీ.ఏ./4980/2022.
  10. పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246332/బీ.ఏ.డీ.ఏ./4981/2022
    12 పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/ 246334/బీ.ఏ.డీ.ఏ./4982/2022.
    13.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/246339/బీ.ఏ.డీ.ఏ./4983/2022.
    14.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/246348/బీ.ఏ.డీ.ఏ./4984/2022.
    15.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/ 246352/బీ.ఏ.డీ.ఏ./4985/2022.
    16.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/ 246354/బీ.ఏ.డీ.ఏ./4986/2022.
    17.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్/246357/బీ.ఏ.డీ.ఏ./4987/2022.
    18.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ /246359/బీ.ఏ.డీ.ఏ./4989/2022.
    19.పర్మిషన్ నెంబర్ / పర్మిట్ నెంబర్ 246361/బీ.ఏ.డీ.ఏ./4990/2022.

కాగా ఈ అవినీతి విషయంపై పూర్తి ఆధారాలను సేకరించి, వ్రాతపూర్వక ఫిర్యాదులు ఇస్తే.. నెలల తరబడి ఫిర్యాదులను తొక్కి పట్టి, భారీ మొత్తంలో లంచాలను దండుకొని, ఈ అవినీతిపై ప్రశ్నిస్తే అడగడానికి మీరెవరు..? మా ఇష్టం వచ్చినట్లు చేస్తాం.. అంటున్నారు మున్సిపల్ కమిషనర్ సరస్వతి.. ఈ అవినీతి అక్రమాలపై, జరుగుతున్న దారుణాలపై స్థానిక కలెక్టర్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ లు వెంటనే దృష్టి సారించి.. ఈ అవినీతి తతంగాన్ని ఆపాలని స్థానిక జనం ఆవేదనతో విజ్ఞప్తి చేస్తున్నారు..

బడంగ్ పేట్ మున్సిపాలిటీలో అవినీతి తారాస్థాయిలో జరుగుతూ ఉంది. ఈ అవినీతిపై ఉన్నత స్థాయి పాలకవర్గం, స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ రంగారెడ్డి జిల్లా కలెక్టర్, రేరా కమిషనర్,మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ కమిషనర్, మున్సిపల్ శాఖ సెక్రెటరీ, మున్సిపల్ శాఖ మాత్యులు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని.. ఇక్కడి ప్రతిపక్ష నాయకులు, సామాన్య జనం డిమాండ్ చేస్తున్నారు..

పదుల సంఖ్యలో అక్రమ లేఔట్లు వందల సంఖ్యలో అక్రమ నిర్మాణాలు పూర్తి ఆధారాలతో తదుపరి కథనంలో.

Latest News

పవర్ ప్లాంట్ ఏర్పాటుకు లీజు ఒప్పందాన్నిప్రారంభిస్తున్నట్లు ప్రకటించిన రేతాన్

వ్యాపార రంగంలో ప్రముఖ సంస్థ రేతాన్ టిఎంటీ లిమిటెడ్ సోలార్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు కొత్త స్థల లీజు ఒప్పందాన్ని ప్రారంభించనున్నట్లు ప్రకటించింది. బనస్కంఠ జిల్లా,...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS