రామ్ గోపాల్ వర్మ పోలీసుల విచారణకు హాజరుకాలేదు. గతవారం ప్రకాశం జిల్లా ముద్దిపాడు మండలం పోలీస్ స్టేషన్ లో ఐటీ చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వ్యూహం సినిమా సమయంలో ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ , నారా బ్రహ్మణీలను కించపరిచేలా రామ్ గోపాల్ వర్మ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారంటూ టీడీపీ మండల ప్రధాన కార్యదర్శి రామలింగం ఇచ్చిన ఫిర్యాదు మేరకు రామ్ గోపాల్ వర్మపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీంతో ఈ కేసుపై విచారణకు హాజరుకావాలని ఏపీ పోలీసులు వర్మకు నోటీసులు అందజేశారు. నోటీసుల ప్రకారం వర్మ ఈరోజు విచారణకు హాజరుకావాల్సి ఉంది. అయితే తాను విచారణకు రాలేనంటూ రామ్ గోపాల్ వర్మ వాట్సప్ ద్వారా పోలీసులకు మెసేజ్ పంపించారు. వ్యక్తిగత పనులు ఉన్నాయని, నాలుగు రోజుల సమయం కావాలని కోరినట్లు సమాచారం.