శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ రానున్నారు. డిసెంబర్ 17 నుండి 21 వరకు రాష్ట్రపతి హైదరాబాద్లో ఉండనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సీఎస్ శాంతికుమారి మంగళవారం అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రాష్ట్రపతి పర్యటనకు సంబంధించి అన్ని శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై జీహెచ్ఎంసీ, పోలీస్, ఆర్ అండ్ బి శాఖ అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశాలు ఇచ్చారు. ఈ సమావేశంలో డిజిపి జితేందర్, హోం స్పెషల్ చీఫ్ సెక్రెటరీ రవిగుప్తాతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.