Friday, September 20, 2024
spot_img

ప్రతి అవసరానికి డబ్బు అవసరమే

Must Read

డబ్బు.. కొత్తగా పరిచయం అవసరం లేదు.దీనికోసం చేయని పని అంటూ ఉండదు..చెప్పనీ అబద్ధాలు ఉండవు..
మనిషి చేతుల్లో పుట్టి, మనిషినే మట్టిలో కరిపించే.. ఒకే ఒక ఆయుధం..
ఎక్కువగా ఉన్న నిద్ర ఉండదు.. తక్కువగా ఉన్న తిండి సరిగా ఉండదు..
కావలసినంత ఉంటే మనుషులు సరిగా ఉండరు… ప్రపంచంలో ఎన్ని భాషలున్న నోరు లేకున్న పలికిస్తుంది…
ప్రపంచంలో ఎన్ని మతాలున్న కళ్ళు లేకుండా నడిపిస్తుంది..
ప్రపంచంలో ఎన్నో దేవుళ్ళు ఉన్న కళ్ళు లేకున్నా చూపిస్తుంది..
మనషిలో మృగాన్ని, కుళ్ళు, కుతంత్ర, స్వార్థం, ఈర్ష..
ఇవన్నీ చూపించే ఆయుధం ఒకటే..
అది డబ్బు.. మనషిలో ఉండే గర్వాన్ని అణిచివేస్తుంది…
మనిషిని మనిషిలా చూపించడం మాత్రం మర్చిపోతుంది..
మనిషి పుట్టుకకు చావుకు, మంచి చెడుకి, ప్రతి అవసరం డబ్బుతో మాత్రమే తీరేలా చేస్తుంది కొన్నిసార్లు..

  • రాగిపని బ్రహ్మచారీ
Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This