ముంబై క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు అమోల్ కాలే ( 47 ) కన్నుమూశారు.భారత్, పాకిస్థాన్ మ్యాచ్ చూసిన అనంతరం హోటల్ కి వెళ్ళిన అనంతరం అయినకు ఒకేసారి గుండెపోటు నొప్పి వచ్చింది.దీంతో వెంటనే ఆసుప్రతికి తరలించారు.ఆసుప్రతికి తరలించే లోపే అయిన తుదిశ్వాస విడిచినట్టు వైద్యులు తెలిపారు.2022లో ముంబై క్రికెట్ అసోసియేషన్ కు ఎన్నికలు జరగగా ఆ ఎన్నికల్లో అమోల్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు.అమోల్ ఆధ్వర్యంలోనే ముంబై జట్టు రంజీ ట్రోఫీని సొంతం చేసుకుంది.దీంతో క్రికెట్ టీంలో విషాదం చోటు చేసుకుంది.గుండెపోటుతో అమోల్ మరణించడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరు అయ్యారు.