ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు అమెరికా ప్రభుత్వానికి పిటిషన్ పెట్టుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తనను ఇబ్బందులకు గురిచేస్తుందని..రాజకీయంగా తనను వేధిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు. గతకొన్ని రోజుల నుండి తాను తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నానని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వంలో తాను కీలక స్థానంలో పనిచేశానని పేర్కొన్నారు.