రామ్‌గోపాల్ వర్మ అరెస్ట్‌కు రంగం సిద్ధమైంది. సోమవారం అయినను అరెస్ట్ చేసేందుకు ఒంగోలు పోలీసులు హైదరాబాద్ చేరుకున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి ఎక్స్‌లో పోస్ట్ చేసిన కేసులో రామ్‌గోపాల్ వర్మ విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రామ్‌గోపాల్ వర్మపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పీఎస్‌లో కేసు నమోదైంది. అయితే ఈ కేసులో పోలీసుల విచారణకు వర్మ డుమ్మా కొడుతూ వస్తున్నారు. ఈరోజు విచారణ హాజరుకావాల్సి ఉండగా..రాలేనంటూ న్యాయవాది ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఒంగోలు పోలీసులు సోమవారం హైదరాబాద్ లోని అర్జీవీ ఇంటికి చేరుకున్నారు. అయినను అరెస్ట్ చేసే అవకాశం ఉంది.