ఉల్లిగడ్డ ధరలు కన్నీళ్ళు తెప్పిస్తున్నాయి..
వరదలతో సబ్బండ జనం కన్నీటి ధారలు ఆపే భరోసా లేదయే..?
అన్నదాతల అరణ్య రోదనలు ఆగకపాయె..!
బడుగు జీవుల్లో బతుకమ్మ దసరా పండుగలు గడవడం కష్టంగా మారే
ప్రకృతి వైపరీత్యము ఒకవైపు డైవర్షన్ రాజకీయాలతో ప్రజా ప్రయోజనాలు పట్టించుకునే నాధుడే లేడాయె..?
గోరంత సాయం కొండంత అండంటూ కన్నీరు తుడిచేందుకు కదిలిన మానవత్వం..
కష్టకాలంలో స్వార్థ రాజకీయాల కోసం ఏడ్చి కళ్ళు మురికి గుంతలకన్న హీనం
బడా బాబులు కనికరం చూపండి..
- మేదాజీ