తెలంగాణ సాంప్రదాయాలు, తెలంగాణ ఆడపడుచుల రూపాన్ని
ఉట్టిపడేలా మలిచిన శిల్పి రమణారెడ్డికి జోహార్లు..
ఉద్యమాలకు చిహ్నంగా, ఉద్యమకారులను నిరంతరం స్మరించుకుంటూ
ఉండేలా ఉద్యమకారుల వందలాది చేతులు,
తెలంగాణా తల్లిని పైకి ఎత్తుతూ కనిపించే చేతులతో
మలిచిన తెలంగాణ తల్లి విగ్రహం, ఉద్యమకారుల త్యాగ ఫలాలను గుర్తుచేస్తాయి.
అలంకారాలతో దేవత మూర్తి గుడిలో ఉండాలి, సీదా సాదాగా కనిపించే తల్లి మన ఎదుట
ఉండాలి, మనకు దగ్గరిగా ఉండాలి మన గుండెలో ఉండాలి, అనే శిల్పి ఆలోచనకు జోహార్లు..
తెలంగాణ సాంప్రదాయాన్ని చాటి చెప్పే విధంగా, తెలంగాణ ఆడపడుచు,
కట్టుబొట్టు, మెడలో కంఠే, గుండ్ల పూసలు, చెవు దిద్దెలు,
కాళ్ళ కడాలు, కాలు మెట్టెలు ఇవి తెలంగాణ ఆడపడుచుల సాంప్రదాయాన్ని,
ఆత్మగౌరాన్ని ప్రపంచానికి చాటే విధంగా మలిచిన శిల్పి కి జోహార్లు..
- రాజు