రష్యా తొలిసారి ఉక్రెయిన్ పై ఖండాంతర క్షిపణితో దాడి చేసింది. డెనిపర్ నగరంలో ఈ దాడి జరిగినట్లు కీవ్ వాయుసేన తెలిపింది. అయితే కచ్చితంగా ఏ రకం క్షిపణిని ప్రయోగించారో మాత్రం వెల్లడించలేదు. ఈ ఖండాంతర క్షిపణి వల్ల ఉక్రెయిన్ ఎంత మేర నష్టపోయిందనే విషయం తెలియాల్సి ఉంది. అయితే ఖండాంతర క్షిపణి ప్రయోగంపై రష్యా ఇప్పటివరకు స్పందించలేదు. రెండు రోజుల క్రితం బ్రిటన్ సరఫరా చేసిన లాంగ్ రేంజ్ స్టార్మ్ షాడో క్షిపణులను రష్యాపై ఉక్రెయిన్ ప్రయోగించిన నేపథ్యంలో తాజా అటాక్ జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు.