Wednesday, December 4, 2024
spot_img

ఇంకెన్నాళ్ళీ విద్యార్థుల ఆత్మహత్యలు

Must Read

తెలంగాణ రాష్ట్రంలో విద్యా కుసుమాలు నేలరాలుతున్నాయి. విద్యా ప్రమాణాలు సైతం రోజు రోజుకి పడిపోతున్నాయి. విద్యకు, విలువల బోధనకు చిరునామాగా ఉండాల్సిన ప్రభుత్వ పాఠశా లలు, కళాశాలలు, విశ్వ విద్యాలయాలు ఆత్మహత్యలకు ఆవాంచ నీయ సంఘటనలకు కేరాఫ్గా మారుతున్నాయి. ఒకప్పుడు విద్యా రులను విలువలతో కూడిన విద్యకై గురుకులాల్లో చదివించే వారు కానీ నేడు విలువల మాట దేవుడెరుగు కానీ, విద్యార్థులు విగత జీవులుగా మారి బయటకు వస్తున్నారనటంలో ఎటువంటి సందే హం లేకపోలేదు. రాష్ట్రంలో ప్రజల జీవన ప్రమాణాలలో మార్పు అనివార్యమని, ప్రజలు భావించి, కోరుకున్న మార్పులకు అనుగు ణంగా ప్రజాస్వామ్య పద్ధతిలో మార్పును తీసుకువచ్చారు. ప్రభు త్వాలు మారినప్పటికీ, ప్రభుత్వ విద్యాలయాల్లో చదువుతున్న విద్యా ర్థుల బతుకులు మారడం లేదు. తల్లి తండ్రులు తమ పిల్లల జీవన ప్రమాణాలు మెరుగు పడతాయి అని చదువు కోసం ప్రభుత్వ విద్యాలయాలకు పంపిస్తుంటుంటే అసలువారికి జీవితాలే లేకుండా పోతున్నాయి. ప్రభుత్వ విద్యాలయాల్లో జరుగుతున్నవి. ఆత్మ హత్యలు కావు ముమ్మాటికి ప్రభుత్వ తీరు కారణంగా జరుగుతున్న హత్యలుగానే తెలంగాణ మేధావివర్గం భావిస్తున్నది. ప్రయోగశాలల్లో రసాయనాలతో సమస్యలకు పరిష్కారాలు కనుగొనాల్సిన విద్యార్థులు విషంబాటిల్లను పట్టుకుంటున్నారు. రాబోయే రోజుల్లో డాక్టర్లుగా మారి స్టెతస్కోప్లను మెడలో ధరించాల్సిన వీరు ఉరితాల్లను ముద్దాడుతున్నారు.

అన్నం పరబ్రహ్మ స్వరూపం అనే నానుడి మన భోజనశాలల్లో నిత్యం కనిపిస్తూ ఉంటుంది అయితే అదే అన్నాన్ని తిని స్మశానం బాట పట్టాలని ఆ బ్రహ్మదేవుడే వారి తలరాతను రాసాడేమో గాని కల్తీ అయిన అన్నం తిని విద్యార్థులు జీవచ్ఛావాలుగా మారుతున్నారు. ఇన్ని సంఘటనలు జరుగుతున్న రాష్ట్రంలో 20 మందికి పైగా విద్యార్థుల ఆత్మహత్యలు చేసుకున్న, 40 మందికి పైగా విద్యార్థులు మరణించినా, 30 పర్యాయలకు పైగా ఫుడ్ పాయిజన్ సంఘట నలు జరిగిన, దాదాపుగా 800 మందికి పైగా ఫుడ్ పాయిజన్ జరిగి అనారోగ్యం పాలవుతున్న ప్రభుత్వం స్పందించక పోవటం చర్యలు తీసుకోకపోవడం వెనుక ఉన్న వారి తీరు మాత్రం అనుమానాస్పదంగా ఉంది. అందుకోసం ఈ విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగానే తెలంగాణ పౌర సమాజం భావిస్తున్నది. రాబోయే తరాల కోసం చెరుపుల పరిరక్షణ అనే సదుద్దేశంతో హైడ్రా అనే ఒక డిపార్ట్మెంట్ ఏర్పాటు చేసి ప్రణాళికపరంగా ముఖ్యమంత్రి చెరువుల పరిరక్షణకై ఏవిధంగా పాటుపడుతున్నారో మనం చూస్తూనే ఉన్నాం. మరి అదేవిధంగా విద్యార్థులు పిట్టల్లరాలిపోతున్న కనీసం స్పందించడం లేదు. కాస్మాటిక్ చార్జీలు పెంచాం, విద్యా కమిషన్ ఏర్పాటు చేశాం విద్యారంగాన్ని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేస్తాం అని ప్రగల్బాలు పలుకుతున్న ప్రభుత్వం ఈ ప్రభుత్వ విద్యాలయాల్లో జరుగుతున్నటువంటి ఆత్మహత్యల పైనగాని ఫుడ్ పాయిజన్ ఘటనలపైన గాని, ఇతర అవాంఛనీయ సంఘటనలపై ఎందుకు స్పందించడం లేదు. కాస్మటిక్ ఛార్జీలు పెంచాం అనగానే, విద్యా కమిషన్ ఏర్పాటు చేయగానే పూల బొకేలతో ముఖ్యమంత్రికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మెల్యేల బృందం ఈ ఫుడ్ పాయిజన్ ఘటనలని, విద్యార్థుల ఆత్మహత్యల ఆక్రంద నలని ముఖ్యమంత్రి దృష్టికి ఎందుకు తీసుకువెళ్లడం లేదు అనేది తెలంగాణ పౌర సమాజం ముందున్నటువంటి ఒక అంతు చిక్కనటువంటి ప్రశ్న. అసలుయిన్ని ఫుడ్ పాయిజన్ సంఘటనలు, విద్యార్థుల ఆత్మహత్యలు జరుగుతున్న ప్రభుత్వంగాని, వివిధ కులాల వారిగా కేటాయించినటువంటి సంక్షేమ శాఖల మంత్రులు గాని, ప్రభుత్వ అధికార యంత్రాంగం గాని ఎందుకు నేటి వరకు ఎటువంటి రివ్యూ మీటింగ్ సైతం నిర్వహించలేకపోయింది.

అదే విధంగా స్థానికంగా ఉన్నటువంటి ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు ప్రభుత్వం దృష్టికి ఈ సంఘటనలను తీసుకుపోకపోవడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏమిటి. ఇంతటి దారుణమైన సంఘట నలు జరుగుతున్నప్పటికీ విద్యా శాఖకు ఒక మంత్రిని కేటాయిం చాలని ఆలోచన ముఖ్యమంత్రి గారు ఎందుకు చేయడం లేదు, దీని వెనక గురుకులాలను మూసివేసి ప్రభుత్వ వసతి గృహాలను సైతం ప్రభుత్వ విశ్వవిద్యాలయాలోని వసతి గృహాలను సైతం నిర్వీర్యం చేసి, వీటిని ప్రైవేటుపరం చేయాలనే కుట్రలు ఏమైనా చేస్తున్నారా అనే సందేహం తెలంగాణ సమాజంకు కలుగుతున్నది. ప్రభుత్వమే ఇంతటి నిర్లక్ష్యపు వైఖరితో ఉన్న కారణంగానే రాష్ట్రం లోని ప్రభుత్వ వసతి గృహాల్లో మరియు ప్రభుత్వ విశ్వ విద్యాలయ వసతి గృహాల్లో సైతం ఆహారంలో పురుగులు వస్తున్నా యని పత్రికల్లో కథనాలు వస్తున్నప్పటికీ, అక్కడ స్థానికంగా క్రీయా శీల కంగా పని చేస్తున్న విద్యార్థి సంఘాలు ఆందోళనలు చేస్తే ఆయా విద్యార్థులకు ఆయా విశ్వవిద్యాలయ అధికారులు హెచ్చరిక మెమోలు జారీ చేస్తూ ఇది ప్రభుత్వ విశ్వవిద్యాలయం యొక్క వసతి గృహం నచ్చితే తినండి లేదంటే లేదు, లేదు అంటే వసతి గృహాలను ప్రైవేటు పరం చేయాలని ప్రభుత్వము ఆలోచనలు చేస్తున్నదని చాలా గర్వంగా చెబుతున్నారు. అయితే ప్రభుత్వ తీరు ఇంతటి నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు ప్రభుత్వ విశ్వవిద్యాలయ అధికారుల తీరు కూడా ఈ రకంగా ఉండటం సర్వసాధారణమే అనిపిస్తుంది.

జవ్వాజి దిలీప్ సాహు,
7801009838

Latest News

మన నగరాన్నే ఓ బ్రాండ్ క్రియేట్ చేయచ్చుకదా..

హైదరాబాద్‎ను డల్లాస్ చేస్తామని అప్పటి సీఎం కేసీఆర్..న్యూయార్క్ చేస్తా అంటున్న ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి..ప్రపంచంలో ఏదో ఓ సిటీలాగా చేసుడు తర్వాత గానీ..మన నగరాన్నే...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS