చెన్నై వేదికగా భారత్-బంగ్లాదేశ్ జట్టులా మధ్య జరుగుతున్న తొలి టెస్టులో మొదటి రోజు ఆట గురువారం ముగిసింది.ఆట ముగిసే సమయానికి భారత్ 06 వికెట్ల నష్టానికి 339 పరుగులు చేసింది.ఇక ఈ మ్యాచ్లో అశ్విన్ అద్బుతమైన ప్రదర్శనతో సెంచరీ చేశాడు.108 బంతుల్లో శతకం సాధించాడు.మొదట బ్యాటింగ్కు దిగిన భారత్ జట్టుకు ఆరంభంలోనే షాక్ తగిలింది.88 పరుగుల వద్ద రోహిత్ శర్మ (06) రన్స్కే వికెట్ కోల్పోయాడు.సుభ్మన్ గిల్ (0),విరాట్ కోహ్లీ (6) రన్స్ చేసి పెవిలియన్ బాట పట్టాడు.ఆ తర్వాత బ్యాటింగ్ చేసిన రిషబ్ పంత్ 39 పరుగులు చేసి ఔటయ్యాడు.95 బంతుల్లో అర్ధ సెంచరీ చేసిన యశస్వి 144 పరుగుల వద్ద ఐదో వికెట్ కోల్పోయాడు.కేఎల్ రాహుల్ 16 పరుగులు చేసి ఔటయ్యాడు.