సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండించింది. ఐఏఎస్ అధికారిపై కేటీఆర్ చేసిన విమర్శలు పాలనా విధానాలు, రాజ్యాంగ నిబద్ధత ఆధారంగా అధికారులు నిర్వర్తించే బాధ్యతలకు ఉన్నాయని తెలిపారు. ఇలాంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలపై చెడు ప్రభావాన్ని చూపిస్తాయని పేర్కొన్నారు. సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌కు తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం పూర్తి మద్దతు తెలియజేస్తుందని అన్నారు.