Friday, September 20, 2024
spot_img

క్రేజ్‌ను ఆవిష్కరించిన స్విస్ బ్యూటీ

Must Read
  • ట్రెండీ మేకప్ పట్ల కొత్త తరం అభిరుచితో ప్రేరణ పొందిన కలెక్షన్

భారతదేశంలోని ప్రముఖ మేకప్ బ్రాండ్‌లలో ఒకటైన స్విస్ బ్యూటీ తన జెన్ జెడ్ మేకప్ కలెక్షన్ – క్రేజ్‌ని విడుదల చేసింది. ఇది ఏక సమయంలో ఎన్నో పనులు చేసే నవతరం మరియు వారి ప్రయాణంలో మేకప్ అవసరాల కోసం ఎన్నో సౌందర్య ఉత్పత్తుల శ్రేణిని కలిగి ఉంటుందని స్విస్ బ్యూటీ సీఈఓ సాహిల్ నాయర్ తెలిపారు.మల్టి-డైమెన్షనల్ బ్యూటీ ఎసెన్షియల్స్ నుండి వైబ్రెంట్, ఎక్స్‌ ప్రెసివ్ కాస్మెటిక్స్ వరకు జీవితాన్ని గడుపుతూ తాము కనిపించే తీరుతో తామేంటో చాటుకోవాలనుకునే వారికి పరిపూర్ణ నేస్తం స్విస్ బ్యూటీ క్రేజ్ అని వెల్లడించారు.క్రేజ్ కలెక్షన్ అన్ని వర్గాలలో ఆకర్షణీయమైన మేకప్ ఉత్పత్తుల శ్రేణిని ప్రదర్శిస్తుందని అన్నారు. ఐ మేకప్ లో ఐషాడో మరియు బ్లష్ ప్యాలెట్ వంటి వాటి నుండి మాస్కరా వరకు , లిప్ కేటగిరిలోని లిప్ బామ్ల వరకు 12 గంటల పాటు లిప్ క్రేయన్ల వరకు ఉత్పాదనలు ఎన్నో ఉన్నాయని అన్నారు.కలెక్షన్ లోని అన్ని సౌందర్య ఉత్పత్తులు చక్కటి పనితీరును కనబరుస్తూ అధిక పనితీరును కలిగి ఉంటూ క్రేజ్‌ని అందుబాటులో ఉంచుతుందని వెల్లడించారు.” మా క్రేజ్ మేకప్ శ్రేణి డైనమిక్ జెడ్ తరం కోసం వారు కొత్తగా కళాశాలలో అడుగుపెట్టిన వారు , గ్రాడ్యుయేషన్ చేస్తున్న వారు , ఉద్యోగం చేస్తున్న వారు ప్రపంచంలో తమదైన ముద్ర వేస్తున్న శక్తీవంత మైన యువత అవసరాలను తీరుస్తుందని తెలిపారు. యువత ప్రయోగాలు చేసేందుకు, అన్వేషించేందుకు, మేకప్ ద్వారా తమ వ్యక్తిత్వాన్ని వ్యక్తీకరించడానికి ఈ కలెక్షన్ వీలు కల్పిస్తుందని వెల్లడించారు.ఇప్పుడు ఇది క్రేజ్ తో కలర్ కాస్మెటిక్స్ కోసం జెన్స్ ల యొక్క అపరిష్కృతమైన అవసరాలను తీర్చడం లక్ష్యంగా పెట్టుకుంది’’ అని అన్నారు. భారతదేశంలో అందం మరియు వ్యక్తిగత సంరక్షణకు సంబంధించి అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న విభాగం జనరేషన్ జెడ్ అని యువత కేంద్రీకృత బ్రాండ్‌గా మేం మా నాణ్యత, ఆవిష్కరణ, ట్రెండీనెస్ ద్వారా వినియోగదారులతో ప్రామాణికమైన అనుబంధాలను నిర్మించాలనుకుంటున్నాం ” తెలిపారు.స్విస్ బ్యూటీ క్రేజ్ 550 పైగా నగరాల్లో రిటైల్ టచ్ పాయింట్ల నెట్‌వర్క్‌ ను కలిగివుందని . 120 కంటే ఎక్కువ బ్యూటీ అసిస్టెడ్ అవుట్‌లెట్‌లతో దేశవ్యాప్తంగా బలమైన ఉనికిని కలిగి ఉందని అన్నారు . క్రేజ్ యొక్క అన్ని ఉత్పత్తులు ఇప్పుడు నైకా, అమెజాన్, మింత్రా, పర్పుల్ మొదలైన ప్రముఖ మార్కెట్‌ప్లేస్‌లలో అందుబాటులో ఉన్నాయని వెల్లడించారు. ఇటీవలే ప్రారంభించబడిన ప్రత్యేక మైక్రో వెబ్‌సైట్ ట్రెండింగ్ మేకప్ ఉత్పత్తుల కోసం వన్-స్టాప్ షాప్. ఇది వాటి ప్రత్యేకమైన మరియు అద్భుతమైన ఫార్ములేషన్స్ తో రూపుదిద్దుకుంది అని తెలిపారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This