రైతుభరోసా అమలు విషయంలో ‘గుడ్డి కన్న మెల్ల మిన్న అన్న భావన రైతులలో కలుగచేస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం. గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం ‘రైతూ బంధు’ పేరుతో ప్రతీ సీజన్ కి ఎకరాకు 5,000 చొప్పున ఆర్ధిక సహాయం క్రమం తప్పకుండా అందించి రైతులకు వ్యవసాయం లో ఆర్థిక చేయూత ఇచ్చింది అనేది నగ్న సత్యం. అధికార కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ‘రైతు భరోసా’ అని పథకం పేరు మార్చి ఏకరాకి 7,500 అని ఇంత వరకు అమలుకు నోచుకోని హామీలను ఇచ్చి రైతుల ఇబ్బందులకు గురి చేస్తోంది. నవంబర్ లో లేకుంటే డిసెంబర్ కాకుంటే జనవరిలో వేస్తాము అంటూ కాలక్షేప మాటలకే పరిమితం చేస్తూ ఉండటం రైతుల పాలిట శాపంగా మారుతుంది. పెరిగిన క్రిమి సంహారక మందుల ధరలు, విత్తనాల ధరలు, కూలీల ఖర్చులు అధికంగా ఉండటం తో రైతులు చేసేది ఏంలేక బ్యాంకు లలో, మార్పడి షాపుల్లో, వడ్డీ వ్యాపారుల దగ్గర తమ భార్యల పుస్తేలా తాళ్ళు, చెవి కమ్మలు పెట్టీ డబ్బులు తెస్తూ ఉండటం హృదయా విచారకరం. అదే ప్రభుత్వం ‘రైతు భరోసా’ డబ్బులు ప్రతీ సీజన్ లో క్రమం తప్పకుండా అందిస్తే రైతులకు వేడి నీళ్లకు చల్లిల మాదిరి సహాయం చేసినట్లు అవుతుంది. ఇప్పటికి అయినా కాంగ్రెస్ ప్రభుత్వం కళ్ళు తెరిచి రైతు భరోసా సహాయం అందిస్తే అధికారం చేతుల్లో ఉంచుకున్నట్లే… లెకుంటే మాత్రం చాప కింద నీరులా వారిలో రగులుతున్న నిశ్శబ్ద వ్యతి రేఖ దొరని తో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కోల్పోయినా ఆశ్చర్యం లేదు.
- ఎం.ధనంజ్
- 9666109616