Saturday, September 6, 2025
spot_img

ఆప‌రేష‌న్ సిందూర్ డిజైనర్లు

Must Read

ఆపరేషన్ సిందూర్ అనే పేరు ప్రజాదరణ పొందింది. ఈ పేరును స్వయంగా ప్రధాని మోదీయే పెట్టారని వార్తలు వచ్చాయి. అయితే.. ఆపరేషన్ సిందూర్ లోగో కూడా బాగా వాడుకలో ఉంది. ఇప్పుడు ఆ లోగో డైజనర్ల పేర్లు తెర మీదికి వచ్చాయి. లెఫ్టినెంట్ క‌ల్నల్ హ‌ర్ష్‌గుప్తా, హ‌వ‌ల్దార్ సురీంద‌ర్ సింగ్.. ఆప‌రేష‌న్ సిందూర్ లోగోను రూపొందించిన‌ట్లు ఇండియన్ ఆర్మీ ప‌త్రిక BaatCheet తాజా సంచిక వెల్లడించింది.

ఆంగ్ల పదం Sindoorలో రెండు ‘ఓ’ అక్షరాలు ఉండగా వాటిలో ఒక ‘ఓ’ని ప్లేట్ రూపంలో డిజైన్ చేశారు. ఆ ప్లేట్‌లో కుంకుమను పెట్టారు. అది పక్కన ఉన్న మరో ‘ఓ’ అక్షరం కిందికి చెదిరినట్లు చూపించారు. తద్వారా టెర్రరిస్టులు భారత మహిళల నుదట సిందూరాన్ని చెరిపారనే భావన కలిగేలా లోగోకి రూపకల్పన చేశారు.

ప‌హ‌ల్గాం ఉగ్ర‌దాడికి గుణపాఠంగా భార‌త సైన్యం ఆప‌రేష‌న్ సిందూర్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్‌లో భాగంగా పాకిస్థాన్‌లోని ల‌ష్క‌రే తోయిబా, జైషే మ‌హ్మ‌ద్ ఉగ్ర‌ స్థావ‌రాల‌ను నేల‌మ‌ట్టం చేసింది. 2025 మే 7న ఇది జరిగిన నిమిషాల వ్య‌వ‌ధిలోనే భార‌త సైన్యం త‌మ సోష‌ల్ మీడియా హ్యాండిల్‌లో సిందూరం లోగోతో కూడిన ఆప‌రేష‌న్ సిందూర్ పోస్ట‌ర్‌ను పబ్లిష్ చేసింది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This