మాజీ సిఎం బఘేల్ నివాసలో ఈడి సోదాలు
సిఎం తనయుడు చైతన్య బఘేల్ అరెస్ట్
ఛత్తీస్‌గఢ్‌లో మద్యం కుంభకోణం ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఇడి దూకుడు పెంచింది. ఈ క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ బఘేల్‌కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ ఈడీ గట్టి షాకిచ్చింది. మద్యం కుంభకోణానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఆయన కుమారుడు...
విచారణ నిలిపివేయాలన్న పిటిషన్ కొట్టివేసిన సుప్రీం
భూములకు ఉద్యోగాల కుంభకోణం లో బిహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కు చుక్కెదురైంది. ఈ కేసులో ట్రయల్ కోర్టు విచారణను నిలిపివేసేలా ఢిల్లీ హైకోర్టుకు ఆదేశాలివ్వాలని ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారంనాడు కొట్టివేసింది. ఈ కేసులో జోక్యం చేసుకునేందుకు నిరాకరించింది....
హంతక మూఠా సంతోషంతో గాల్లోకి నాలుగు రౌండ్లు కాల్పులు
పహల్గామ్ ఉగ్ర దాడి యావత్తు దేశాన్ని కాకుండా ప్రపంచాన్ని కలవరపాటుకు చేసింది. నలుగురు ముష్కరులు తుపాకులతో చెలరేగిపోయారు. మహిళలు, పిల్లల్ని వదిలేసి భర్తలను చంపేశారు. ఇలా 26 మందిని ఉగ్రవాదులు పొట్టనపెట్టుకున్నారు. ఇక ఈ కేసును ఎన్‌ఐఏ దర్యాప్తు చేస్తోంది. దర్యాప్తులో భాగంగా ఉగ్రవాదులకు ఆశ్రయం...
ఢిల్లీ పర్యటనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర క్రీడలు, కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ముఖ్యమంత్రి భేటీ అయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అభివృద్ధి అంశాలపై చర్చించారు. తెలంగాణలో క్రీడా యూనివర్సిటీ, ఖేలో ఇండియాపై చర్చించినట్లు సమాచారం. తెలంగాణ వేదికగా అనేక క్రీడలు నిర్వహించాలని కేంద్ర క్రీడా శాఖ మంత్రికి వినతి...
వరదనీటిలో మునిగిన సహకార బ్యాంక్
హిమాచల్ ప్రదేశ్‌ను వరదలు ముంచెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రాష్ట్ర సహకార బ్యాంకు నీట మునిగింది. దీంతో లక్షల్లో నగదు, లాకర్లలో దాచిన నగలు, విలువైన పత్రాలు పాడైనట్లు భావిస్తున్నారు. దీంతో కోట్లలో నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. మండి జిల్లాలోని తునాగ్‌లో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర సహకార బ్యాంకు...
కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు
కశ్మీర్ హిమాలయ పర్వతాల్లో మంచులింగం రూపంలో కొలువైన శివుడ్ని భక్తులు దర్శించుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్‌నాథ్ యాత్ర ప్రారంభమైంది. యాత్ర మారాల్లో గగనతలంపై నుంచి కూడా పర్యవేక్షణ సాగుతోంది. 38 రోజుల పాటు సాగే ఈ యాత్ర ఆగస్టు 9 నాటికి పూర్తవుతుంది. 3880 విూటర్ల ఎత్తులో ఉండే గుహలో...
ప్రభుత్వ యోచనలో ఉన్నట్లు సమాచారం
ఈ ఏడాది ఆదాయ పన్నుల రాయితీల రూపంలో మధ్యతరగతి వర్గానికి ఉపశమనం కల్పించిన కేంద్ర ప్రభుత్వం మరో చర్యకు సిద్ధమవుతోంది. మధ్యతరగతి, తక్కువ ఆదాయ కుటుంబాలను దృష్టిలో ఉంచుకుని వస్తు సేవల పన్ను(జీఎస్‌టీ) తగ్గించాలని భావిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. 12 శాతం జీఎస్టీ స్లాబ్‌ను పూర్తిగా తొలగించం లేదా...
రైల్వే ప్రయాణికులకు అందుబాటులోకి సేవలు
రైలు ప్రయాణీకులకు శుభవార్త. ఇక రైలు సవేలన్నీ ఒకే చోట పొందవచ్చు. సిఆర్‌ఐఎస్ 40వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల సందర్భంగా రైల్వే మంత్రిత్వ శాఖ ’రైల్‌వన్’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ యాప్ ఆండ్రాయిడ్ ప్లే స్టోర్, ఐఓఎస్ యాప్ స్టోర్ రెండిరటిలోనూ...
షుగర్ ఫ్యాక్టరీలో కొట్టుకు పోయిన కోట్ట విలువ చక్కెర
రాత్రికి రాత్రే భారీగా కురిసిన వానలతో హర్యానాలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. యమునానగర్ లోని సరస్వతి సుగర్ మిల్ ప్రాంగణం లోకి నీరు చేరింది. దాంతో ఆసియాలో అతిపెద్ద షుగర్ మిల్‌గా పేరు గాంచిన దానిలో కోట్ల రూపాయల విలువ చేసే పంచదార కరిగిపోయింది. యమునానగర్...
భారత్, పాకిస్థాన్‌లు తమ కస్టడీలో ఉన్న పౌర ఖైదీలు, మత్సకారుల వివరాల జాబితాలను పరస్పరం మార్పిడి చేసుకున్నాయి. వీటి ప్రకారం ప్రస్తుతం పాక్ చెరలో భారతీయులు, భారతీయులుగా పరిగణిస్తున్న 246 మంది పేర్లను వెల్లడించింది. వారిలో 53 మంది పౌర ఖైదీలు, 193 మంది మత్సకారులు ఉన్నారు. ఇస్లామాబాద్ లోని భారత హైకమిషన్‌కు పాక్...