Saturday, September 6, 2025
spot_img

పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్న పురుష

Must Read

టైటిల్ పోస్టర్‌ను రిలీజ్ చేసిన సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి

కామెడీ ప్రధానంగా వచ్చే చిత్రాలకు ప్రస్తుతం ఆదరణ ఎక్కువగా ఉంటోంది. లాజిక్స్ లేకపోయినా కామెడీ వర్కౌట్ అయితే చాలు బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాలు నమోదు చేస్తున్నాయి. ఇక ఇలాంటి పూర్తి అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్‌గా ‘పురుష:’ అనే చిత్రం రాబోతోంది. బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది అనే లైన్స్‌తో సినిమాపై ఆసక్తి పెంచేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి.

బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ మూవీని శనివారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభ ముహుర్తానికి వడ్డవల్లి వెంకటేశ్వర రావు(బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టగా, బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.

మళ్లీ రావా , జెర్సీ, మసుధ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వీరు ఉలవలను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. తన శిష్యుడి కోసం సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు.

ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ కోటి. ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి.గణేష్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు. నటీనటులు : పవన్ కళ్యాణ్, వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌, వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి.గణేష్ తదితరులు

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This