ప్రిజం పబ్‌లో ఘటన
హీరోయిన్, పబ్ నిర్వాహకుల మధ్య గొడవ
హైదరాబాద్ గచ్చిబౌలి విప్రో సర్కిల్ వద్ద ఉన్న ప్రిజం పబ్‌లో హీరోయిన్ కల్పికపై దాడి జరిగింది. బర్త్‌డే కేక్ విషయంలో కల్పిక, పబ్ నిర్వాహకుల మధ్య గొడవ చోటుచేసుకుంది. ఇరు వర్గాల మధ్య మాటా మాటా పెరగటంతో పబ్ సిబ్బంది కల్పికపై దాడి చేశారు. పబ్ నిర్వాహకులు తన పట్ల దురుసుగా ప్రవర్తించారని కల్పిక ఆరోపించారు. పబ్ యాజమాన్యంపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే వాళ్లు కూడా అలాగే ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎట్టకేలకు కల్పిక ఫిర్యాదుతో పోలీసులు కేసు బుక్ చేసి దర్యాప్తు చేపట్టారు.