Friday, July 18, 2025
spot_img

అదరగొట్టిన భారత మహిళల జట్టు

Must Read

ఇంగ్లాండ్‌తో తొలి వన్డేలో విజయం

సౌథాంప్టన్‌ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి వన్డేలో భారత మహిళల జట్టు అదరగొట్టింది. నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఇంగ్లాండ్‌పై తొలి టీ20 సిరీస్‌?ను 3-2 తేడాతో ఇప్పటికే నెగ్గిన టీమ్ ఇండియా, ఇప్పుడు అదే జోష్‌?లో తొలి వన్డేలో రాణించింది.అలా మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌? శుభారంభం చేయగా, తొలి వన్డే ఆసక్తికరంగా సాగింది. హర్మన్‌సేన ఆతిథ్య జట్టును చిత్తు చేసింది. అయితే తొలుత టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లాండ్‌ నిర్ణీత 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 258 పరుగులు చేసింది.బర్త్‌ డే గర్ల్‌ సోఫియా డంక్లీ (83: 92 బంతుల్లో 9 ఫోర్లు), డేవిడ్‌సన్‌ రిచర్డ్స్‌ (53) అర్ధశతకాలతో రాణించారు. దీంతో ఆ జట్టు స్కోరు 250 దాటింది. క్రాంతి గౌడ్‌ (2/55), స్నేహ్‌ రాణా (2/31) ప్రత్యర్థి జట్టును కట్టడి చేశారు. తెలుగమ్మాయి శ్రీచరణి ఒక వికెట్‌ తీసింది. అమన్‌జోత్‌ కౌర్‌ మరో వికెట్‌ తీసింది.

అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 48.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. దీప్తి శర్మ (62లి: 64 బంతుల్లో 3 ఫోర్లు, ఒక సిక్స్‌) చెలరేగింది. తన మెరుపు ఇన్నింగ్స్‌?తో ఆకట్టుకుంది. జెమీమా రోడ్రిగ్స్‌ (48: 54 బంతుల్లో 5 ఫోర్లు) అదరగొట్టింది. కానీ అర్ధశతకం మిస్‌ చేసుకుంది.వికెట్‌కు 90 పరుగులు జోడిరచిన దీప్తి శర్మ, జెమీమా రోడ్రిగ్స్‌ (48) జట్టును విజయపథంలో నడిపించారు. ప్రతీకా రావల్‌ (36), స్మృతి మంధాన (28), హర్లీన్‌ డియోల్‌ (27), హర్మన్‌ ప్రీత్‌ కౌర్‌ (17), రీచా ఘోష్‌ (10), అమన్‌జోత్‌ కౌర్‌ (20లి: 14 బంతుల్లో 3 ఫోర్లు) పరుగులు చేశారు. ఇంగ్లాండ్‌ బౌలర్లలో ఛార్లెట్‌ డీన్‌ 2, లారెన్‌ బెల్‌, సోఫీ ఎకెల్‌స్టోన్‌, లారెన్‌ ఫైలర్‌ ఒక్కో వికెట్‌ తీశారు. తొలి వన్డేలో విజయంతో విజయంతో మూడు వన్డేల సిరీస్‌లో భారత్‌ 1-0తో ఆధిక్యం సాధించింది. లక్ష్య చేధనలో టీమిండియాకు ఆశించిన శుభారంభం దక్కలేదు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో స్మృతి మంధాన(28) కీపర్‌ క్యాచ్‌గా వెనుదిరిగింది. దాంతో తొలి వికెట్‌కు 48 పరుగుల భాగస్వామ్యమే నమోదైంది. ఆ తర్వాత ప్రతీకా రావల్‌ ఔటవ్వగా, హర్లీన్‌ డియోల్‌ వెనువెంటనే వెనుదిరిగారు. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(17) తన వైఫల్యాన్ని కొనసాగించింది. దాంతో భారత్‌ 124 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో జెమీమాతో కలిసి దీప్తి శర్మ జట్టును ఆదుకుంది.

ఈ క్రమంలో దీప్తి శర్మ 52 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోగా.. జెమీమా తృటిలో హాఫ్‌ సెంచరీ చేజార్చుకుంది. దాంతో ఐదో వికెట్‌కు నమోదైన 90 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ వెంటనే రిచా ఘోష్‌(10) కూడా ఔటవ్వడంతో మ్యాచ్‌ ఉత్కంఠగా మారింది. భారత విజయానికి చివరి 33 బంతుల్లో 33 పరుగులు చేయాల్సి రాగా.. అమన్‌జోత్‌ కౌర్‌(14 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్‌) దూకుడుగా ఆడి భారత విజయాన్ని లాంఛనం చేసింది. వరుసగా రెండు బౌండరీలు బాది విజయాన్ని అందించింది.

Latest News

ఆండ్రీ రస్సెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై

సిరీస్‌ మధ్యలో రిటైర్‌మెంట్ ప్రకటన వెస్ట్‌ ఇండీస్‌ ఆల్‌ రౌండర్‌ ఆటగాడు ఆండ్రీ రస్సెల్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పేశాడు. ఆస్ట్రేలియాతో జరిగే టీ20 సిరీస్‌ తర్వాత...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS