Sunday, September 7, 2025
spot_img

ఆయిల్‌పామ్‌తో ఆర్థికంగా బలోపేతం

Must Read

రైతులకు సూచించిన మంత్రి పొన్నం

ఆయిల్‌పామ్ సాగుతో రైతులు ఆర్థికంగా బలోపేతమవుతారని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. ఈ పంట ఒక రకంగా కర్షకులకు వరమని చెప్పారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో శుక్రవారం (2025 మే 30న) నిర్వహించిన ఆయిల్‌పామ్ అవగాహన సదస్సులో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతును రాజు చేసేందుకు కట్టుబడి ఎన్నో సంక్షేమ కార్యక్రమాను చేపట్టిందని తెలిపారు. ఇందులో భాగంగా ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహిస్తోందని పేర్కొన్నారు.

తెలంగాణ ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి మాట్లాడుతూ ఆయిల్‌పామ్ సాగు విస్తీర్ణాన్ని పెంచాలని, ఈ మేరకు ఆయిల్ ఫెడ్.. రైతులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. సదస్సుకు రైతులు పెద్ద సంఖ్యలో వచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ మను చౌదరి, ఆయిల్ ఫెడ్ ఈడీ ప్రశాంత్ కుమార్, జనరల్ మేనేజర్ సుధాకర్ రెడ్డి, ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీకాంత్ రెడ్డి, ఆయిల్ ఫెడ్ అధికారులు ప్రవీణ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This