Friday, September 5, 2025
spot_img

ఓలా.. డీలా..

Must Read

ఓలా ఎలక్ట్రిక్.. డీలా పడుతోంది. టాప్ వన్ రేంజ్ నుంచి థర్డ్ ప్లేస్‌కి డౌన్ అయింది.ప్రభుత్వ లెక్కల ప్రకారం 2025 మే నెల ఒకటో తేదీ నుంచి 26 తేదీ మధ్యలో ఓలా విద్యుత్ వాహన రిజిస్ట్రేషన్లు 15,221 మాత్రమే జరిగాయి. 2024 మే నెలలో 37,388 వాహనాలు రిజిస్ట్రేషన్ కాగా ఈసారి 60 శాతం తగ్గాయి. దీంతో ఏప్రిల్‌లోని 22.1 శాతం మార్కెట్ వాటా నుంచి మే నెల నాటికి 20 శాతం వాటాకి లాస్ అయింది.

పోయినేడాది ఇదే సీజన్‌లో ఈవీ టూవీలర్ విభాగంలో 50 శాతం మార్కెట్ షేర్‌తో ఓలా నంబర్ వన్‌గా నిలిచింది. ప్రస్తుతం 25 శాతం వాటాతో టీవీఎస్ మోటార్ మొదటి స్థానానికి చేరింది. 22.6 శాతం షేర్‌తో బజాజ్ ఆటో రెండో స్థానంలో ఉంది. ఏథర్ ఎనర్జీ 13.1 శాతంతో నాలుగో ప్లేస్‌‌తో సరిపెట్టుకుంది. ఓలా ఎలక్ట్రిక్.. ప్రభుత్వానికి చెప్పిన గణాంకాలకు, సొంతంగా ప్రకటించుకున్న లెక్కలకు పొంతన కుదరట్లేదు.

వాహన్ పోర్టల్‌లో ఓలా ఎలక్ట్రిక్ రిజిస్ట్రేషన్లు 8,652 కాగా ఆ సంస్థ మాత్రం ఏకంగా పాతిక వేల యూనిట్లను అమ్మినట్లు చెబుతోంది. ఈ నేపథ్యంలో ఓలా ఎలక్ట్రిక్ సమర్పించిన డేటాపై ఆటోమోటివ్ రీసెర్చ్ అసోసియేషన్ విచారణ మొదలుపెట్టింది. ఈ కంపెనీ ఇప్పటికే వెహికిల్ క్వాలిటీతోపాటు సర్వీసుల్లో లోటుపాట్లపై దర్యాప్తు ఎదుర్కొంటోంది. ఈ సమస్యల వల్ల ఓలా.. ద్విచక్ర వాహన విపణిలో ప్రాభవాన్ని కోల్పోతోంది.

Latest News

సీబీఐ విచారణ నిలిపివేయండి

కాళేశ్వరం ప్రాజెక్టు కేసులో హైకోర్టు ఆదేశం కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంలో జస్టిస్ పీసీ ఘోష్ నివేదిక ఆధారంగా సీబీఐ దర్యాప్తు కొనసాగించవద్దని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. మాజీ...
- Advertisement -spot_img

More Articles Like This