శ్రీరాముడింట శ్రీక్రిష్ణుడంట, నివాసి చిత్రాల తరువాత గాయత్రీ ప్రొడక్షన్ నిర్మిస్తున్న చిత్రం “కాళాంకి బైరవుడు”. హారర్, థ్రిల్లర్ జోనర్ లో రూపుదిద్దుకుంటున్న ఈ చిత్రంలో రాజశేఖర్ వర్మ, పూజ కిరణ్ హీరో, హీరొయిన్ గా నటిస్తున్నారు. హరి హరన్.వి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కె.ఎన్.రావు, శ్రీనివాసరావు.ఆర్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ ని రాజశేఖర్ జీవిత లాంచ్ చేశారు. హీరోని ఇంటెన్స్ లుక్ లో పవర్ ఫుల్ గా ప్రజెంట్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ అదిరిపోయింది. ఈ చిత్రం లో ఆమని, రితిక చక్రవర్తి, నాగ మహేష్, బలగం జయరాం, భవ్య, మహమద్ బాషా, బిల్లి మురళి నటిస్తున్నారు.