- తల్లిదండ్రులకు మతులు పోగొడుతున్న కో-లివింగ్ సంస్కృతీ
- గతంలో ముంబాయి, ఢిల్లీ, కోల్కత్త, బెంగళూరు నగరాలకే పరిమితం
- నేడు తెలుగు రాష్ట్రాల్లో కూడా పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు.
- సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్
- ఆ గైడ్ లైన్స్ ఆధారంగానే అనుమతులు లేకుండానే ఏర్పాటు
ఒకప్పుడు ఒక అమ్మాయి, అబ్బాయి మాట్లాడుకుంటేనే తప్పు.. ఇప్పుడు కలిసి తిరిగినా తప్పులేదు.. ఒకప్పుడు పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయి కలుసుకోవడం.. మాట్లాడుకోవడం అంటే ఆమ్మో క్షమించరాని నేరం.. ఇప్పుడు ఫ్రీ వెడ్డింగ్ యుగానికి మనం వచ్చేశాము..పెళ్ళికి ముందే అమ్మాయి, అబ్బాయి మనసు విప్పి మాట్లాడుకోవచ్చు.. ఒకరి గురించి మరొకరు తీరిగ్గా అన్నీ తెలుసుకోవచ్చు.. ఇద్దరుకలిసి వేడుకలు జరుపుకోవచ్చు.. వేడుకల్లో పాల్గొననూవచ్చు.. వీటిలో కొన్ని మంచి విషయాలు ఉంటే… మరికొన్ని చెడు అంశాలు కూడా దాగి ఉన్నాయి.. అవన్నీ అటుంచితే..పెళ్లి కాదు.. చుట్టాలు కాదు.. స్నేహితులు కాదు.. ముక్కు ముఖం తెలియని వ్యక్తులతో కలిసి జీవించడమంటే.. అది తల్లిదండ్రులకు కూడా తెలియకుండా జరిగితే… దానికి ఇటీవల హాస్టల్స్ తెరిచి మరి అద్దెలిస్తుంటే.. వాటిని ఏమనాలి.. ఏ పేరుతో పిలువాలి.. దానికి నేటి యూత్ పెట్టిన పేరు కో-లివింగ్..

నగరానికి నయా కల్చర్..
వ్యాపారంలో నెలకొని ఉన్న పోటీల కారణంగా కొంతమంది వ్యక్తులు వింతపోకడలతో ధనార్జనే ద్యేయంగా వ్యాపారాలు కొనసాగిస్తున్నారు.. అందులో కొన్ని చట్ట విరుద్ధమైతే.. మరి కొన్ని సమాజ విలువలను బజారుకు ఈడ్చేవిగా ఉన్నాయి.. అందులోంచి పుట్టుకొచ్చిందే కో-లివింగ్ కల్చర్.. ఈ పదం ఇటీవల యూత్ లో ట్రేండింగ్ గా వినిపిస్తున్న పేరు.. ఒకప్పుడు ముంబాయి, ఢిల్లీ, కోల్కత్త, బెంగళూరు నగరాలకు మాత్రమే పరిమితమైన ఈ కల్చర్ ఇప్పుడు నగరానికి చేరుకొని తల్లిదండ్రులకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.. నగరంలో ఈ కో లివింగ్ కల్చర్ శరామామూలుగా మారింది. పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ఒకే ప్లాట్ తీసుకొని ఉండటాన్ని కో లివింగ్ అంటున్నారు… మన సంస్కృతి, సాంప్రదాయాలకు కాస్త భిన్నంగా అనిపించినా ప్రస్తుతం ఈ కో లివింగ్ కల్చర్ యూత్ లో ట్రెండ్‌గా మారింది.
ఇటీవల పుట్టగొడుగుల్లా వెలిసిన వసతి గృహాలు :-
నిజానికి ఈ కో లివింగ్ హాస్టల్స్‌కు ఎలాంటి అనుమతులు ఉంటాయి? ఒకవేళ అనుమతులుంటే ఎలా తీసుకోవాలి.. అనుమతులు ఎవరిస్తారు..? వాటి పర్యవేక్షణ బాధ్యత ఎవ్వరిది.? కలిసి ఉంటున్న రూమ్ మేట్స్ మధ్యలో సమస్యలు వస్తే వారు ఎవరిని ఆశ్రయించాలి.. అనే అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం. నిజానికి ఇద్దరు మగ వాళ్ళు ..లేదా ఇద్దరు ఆడవాళ్లు ఒకే రూములో లేక ఒకే పీజీలో కలిసి ఉంటే సమస్యే లేదు. దానికి బిన్నంగా ఒక అడ ఒక మగ ఉంటేనే అసలు సమస్య ఉత్పన్నమవుతోంది.. హైదరాబాద్ నగరంలో కో లివింగ్ హాస్టళ్ల సంస్కృతీ రోజురోజుకు పెరుగుతున్నాయి. దిల్ షుక్ నగర్, అమీర్‌పేట్, ఎస్ఆర్ నగర్, మాదాపూర్, గచ్చిబౌళి, కేపీహెచ్‌బీ, రాయదుర్గం, కోకాపేట వంటి ఏరియాలో ఈ కో లివింగ్ కల్చర్ కాస్త ఎక్కువగా కనబడుతుంది. మొన్నటివరకు ముంబాయి, ఢిల్లీ, కోల్కత్తా, బెంగళూరు వంటి రాష్ట్రాల్లో ఈ తరహా లివింగ్ స్టైల్ ఉండేది. క్రమేపీ అది తెలుగు రాష్ట్రాలకు సైతం పాకింది.
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడం లీగల్:-
సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్‌గా ఎలాంటి తప్పులేదు.. ఈ పాయింట్ నే తమకు అనుకూలంగా మార్చుకున్న కొంత మంది నిర్వాహకులు ఎడాపెడా ఈ కో లివింగ్ రిలేషన్స్ వసతి గృహాలను తెరిచేశారు.. కానీ వీటి ద్వారా కొన్ని అబ్యూజ్, క్రైమ్స్‌కు దారి తీసే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు సామజిక పెద్దలు, మత గురువులు చెబుతున్న మాట.. నిజానికి కో-లివింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసే నిర్వాహకులు ఎలాంటి అనుమతులు తీసుకోవడంలేదు.. ఇటీవల పోలీసులు కూడా వీటిపై నిఘా పెట్టడం ప్రారంభించారు.. నిజానికి నగరంలోని ఏ కో లివింగ్ హోస్టల్ కి అనుమతిలేదు.. అయినా నిర్వాహకులు యదేచ్చగా నడుపుతున్నారు.. వీటి నిర్వహణకు అవసరమైన అనుమతులు ఎక్కడ తీసుకోవాలో ఎవరిస్తారో కూడా ఎవ్వరికి తెలీదు..
కో లివింగ్ రిలేషన్స్ సమస్యలు వస్తే ..?
కో లివింగ్ రిలేషన్స్ వసతి గృహాలలో ఆడ, మగకు ఏమైనా సమస్యలు వస్తే అవి పరిష్కారం చూపలేని స్థితిలో వ్యక్తులు ఉన్నప్పుడు.. ఎక్కడికి వెళ్ళాలి ఎవరికీ చెప్పుకోవాలి.. లాడ్జీలలో ఆడ, మగ కలిసి ఉంటె తప్పు.. మరి కో లివింగ్ రిలేషన్స్ సెంటర్లలో ఆడ, మగ కలిసే ఉంటున్నారు కదా అది ఎందుకు తప్పుగా పరిగణించబడటం లేదనేది ప్రశ్నగానే మిగిలిపోయింది.. ఈ తరహా కేంద్రాలపై ఎందుకు ప్రభుత్వం, పోలీసులు దృష్టి సారించడం లేదు.. ఇది తప్పుకాదా..? సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఇద్దరు మేజర్లు కలిసి ఉండడంలో లీగల్‌గా ఎలాంటి తప్పులేదు.. మరి లాడ్జీలలో తరుచూ పోలీసులు ఎందుకు దాడులు చేస్తున్నట్లు.. వాళ్లు మేజర్లే కదా అది కూడా తప్పు కాదు కదా..? ఎందుకు తప్పుగా చూస్తున్నట్లు ..?
ఇది మంచి కల్చర్ కాదంటున్న తల్లిదండ్రులు.. మానసిక వైద్యులు :-
పెళ్లి కాకుండానే రిలేషన్ షిప్లో అమ్మాయిలు, అబ్బాయిలు కలిసి ఓకే హాస్టల్ లేదా ఒకే ప్లాట్ తీసుకొని ఉండటాన్ని తల్లిదండ్రులు.. మానసిక వైద్యులు, మతగురువులు తప్పుబడుతున్నారు.. కో లివింగ్ కారణంగా కుటుంబ వ్యవస్థలు చిన్నాభిన్నం అవుతాయని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. ఓకే రూమ్‌లో ఉన్న వీళ్ళ మధ్య మనస్పర్ధలు వచ్చిన్పపుడు ఇద్దరి కలిసి ఉన్న ఫోటోలు, వీడియోలతో బెదిరింపులకు దిగే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
వివాదమైతే తప్ప ప్రభుత్వం, పోలీసులు స్పందించరా …?
ఇటీవల సామాజిక మాధ్యమాల వేదికగా జరుగుతున్న మోసాలపై చట్టాలు ఎలా వ్యవహరించాలో అర్ధం కాలేని పరిస్థితి ఏర్పడింది..సమాజంలో కంటికి కనబడే మోసాలు కొన్నయితే .కంటికి కనబడని మోసాలు.. కోకొల్లలుగా వెలుగు చూస్తున్నాయి.. మోసాల తాలూకు ఘశారం సక్కగా లేకపోతె బయటపడుతున్నాయిగాని.. వెలుగు చూడని ఘటనలు కోకొల్లలు ఉన్నాయి..ఇటీవల జరుగుతున్న కొన్ని మోసాలను ఆ దేవుడు కూడా కనిపెట్టలేకపోతున్నాడన్నది అక్షర సత్యం.. దీనికి ఉదాహరణే మినీ ఫైనాన్స్ స్కీమ్స్, మనీ గేమింగ్ యాప్స్ .. దీనిలో కొంతమంది డబ్బులు గుల్లా చేసుకుని ప్రాణాలు కోల్పోతేగాని చట్టాలు జోక్యం చేసుకోలేదు.. ఇలానే కో లివింగ్ కారణంగా కూడా తాము మోసపోయని.. భవిష్యత్తులో కొంతమంది అమ్మాయిలు లేదా అబ్బాయిలు ఫిర్యాదు చేస్తే తప్ప ప్రభుత్వం, చట్టాలు దృష్టిసారించవని అవగతమవుతోంది..