మాజీ మంత్రి, వైసీపీ నేత పేర్ని నాని సతీమణిపై మచిలీపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. రేషన్ బియ్యం అక్రమాలపై పౌరసరఫరాల శాఖ అధికారి కోటిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జయసుధపై కేసు నమోదైంది.
గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి పేర్ని నాని తన సతీమణి జయసుధ పేరిట బందరు మండలం పోట్లపాలెంలో గోడౌన్ నిర్మించారు. దానిని సివిల్ సప్లయిస్‌కు బఫర్ గోడౌన్‌గా అద్దెకు ఇచ్చారు. గత పది రోజుల క్రితం వార్షిక తనిఖీల్లో భాగంగా పేర్నినాని గోడౌన్‌ను సివిల్ సప్లాయిస్ అధికారులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా తీవ్ర వ్యత్యాసాన్ని అధికారులు గుర్తించారు. 185 టన్నుల పిడీఎఫ్ బియ్యం మాయమైనట్లు నిర్ధారించారు.