- దిల్‌సుఖ్ నగర్ బాంబ్ బ్లాస్ట్ కేసులో సంచలన తీర్పు
- ఎన్‌ఐ కోర్టు తీర్పును సమర్థించిన హైకోర్టు
- అప్పీల్‌ను తిరస్కరిస్తూ.. ఉరిశిక్ష వేసిన హైకోర్టు
- సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణ
- 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లో జంట పేలుళ్లు..
- జంట పేలుళ్లలో 18 మంది మృతి, 131 మంది గాయాలు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్‌సుఖ్‌నగర్ బాంబు బ్లాస్ట్ కేసులో తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో నిందితులను దోషులుగా నిర్ధారించిన హైకోర్టు.. వారు వేసిన పిటిషన్‌ను డిస్మిస్ చేసింది. ఈ కేసులో ప్రమేయం ఉన్న ఐదుగురు దోషులకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పును వెల్లడించింది. ట్రయల్ కోర్ట్ ఇచ్చిన తీర్పును జస్టిస్ లక్ష్మణ్, జస్టిస్ శ్రీసుధతో కూడిన ధర్మాసనం ధర్మాసనం సమర్ధించింది. అలాగే ఉరిశిక్షను ఖరారు చేసింది. సుమారు 45 రోజుల పాటు హైకోర్టు సుదీర్ఘంగా విచారణను జరిపింది. 2016 డిసెంబర్ 13న ఐదుగురు నిందితులను దోషులుగా గుర్తించి ఉరిశిక్ష విధిస్తూ ఎన్‌ఐఏ కోర్టు తీర్పు ఇచ్చింది. అయితే ఎన్‌ఐఏ కోర్టు ఇచ్చిన తీర్పును హైకోర్టులో నిందితులు సవాల్ చేశారు. విచారణ జరిపిన ధర్మాసనం.. తీర్పును రిజర్వ్ చేసింది. మంగళవారం తీర్పును వెల్లడించింది. బాంబ్ బ్లాస్ట్‌లో వీరి కుట్రను గుర్తించి దోషులుగా తేల్చింది. ఈ ఐదుగురికి ఉరిశిక్ష ఖరారు చేస్తూ హైకోర్టు ధర్మాసనం తీర్పును వెల్లడించింది. పేలుళ్లకు పాల్పడ్డ ఐదుగురికి ఉరి శిక్ష సరైనదేనని సంచలన తీర్పునిచ్చింది. 2013లో దిల్‌సుఖ్‌నగర్‌లో పేలుళ్లు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 130 మందికి గాయాలు అయ్యాయి. ఈ విషాద ఘటన నగర ప్రజలను భయబ్రాంతులకు గురిచేసింది. 2016లో ఫాస్ట్‌ట్రాక్‌కోర్టు యాసిన్ భత్కల్ సహా ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. అయితే కింది కోర్టు తీర్పుపై ముద్దాయిలు హైకోర్టును ఆశ్రయించారు. ప్రధాన నిందితుడు రియాజ్‌భత్కల్ ఇప్పటికి పరారీలో ఉన్నాడు. ఈ జంట పేలుళ్లకు ప్రధాన కారకుడైన యాసిన్ భత్కల్ అని పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌లోని బస్టాపులో, మిర్చిపాయింట్ వద్ద జరిగిన జంట పేలుళ్లలో 18 మంది మృతి చెందగా, 131 మంది గాయపడ్డారు. ఉరిశిక్ష పడిన నిందితుల్లో అసదుల్లా అక్తర్ అలియాస్ హద్ది, జియా ఉర్ రహమాన్ అలియాస్ వఘాస్ అలియాస్ నబీల్ అహమ్మద్, మహ్మద్ తహసీన్ అక్తర్ అలియాస్ హసన్ అలియాస్ మోను, యాసిన్ భత్కల్ అలియాస్ షారూఖ్, అజాజ్ షేక్ అలియాస్ సమర్ ఆర్మాన్ తుండె అలియాస్ సాగర్ అలియాస్ ఐజాజ్ సయ్యద్ షేక్ ఉన్నారు. అనంతరం ఉరిశిక్ష ధ్రువీకరణ నిమిత్తం ఎన్‌ఐఏ కోర్టు తీర్పును హైకోర్టుకు నివేదించింది. దీంతోపాటు ఐదుగురు నిందితులు కింది కోర్టు తీర్పును రద్దు చేయాలని కోరుతూ అప్పీళ్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కె.లక్ష్మణ్, జస్టిస్ పి.శ్రీసుధలతో కూడిన ధర్మాసనం సుమారు 45 రోజులపాటు సుదీర్ఘ విచారణ జరిపి తీర్పు వాయిదా వేసింది. నేడు ఎన్‌ఐఏ కోర్టు తీర్పును సమర్థిస్తూ ఆదేశాలు జారీ చేసింది.