- సీఎం రేవంత్ రెడ్డి
గతంలో దేశంలో ఏ ప్రభుత్వం చేయని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే రైతులకు రూ.2 లక్షల పంట రుణామాఫీ చేసిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. శనివారం మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన రైతు పండుగ ముగింపు వేడుకలకు అయిన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన ఏడాదిలోనే 25 లక్షల రైతు కుటుంబాలకు రూ.21 వేల కోట్ల రుణామాఫీ చేశామని తెలిపారు. రుణామాఫీపై చర్చకు సిద్ధమని అన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వ పాలనాలో రైతులు సంతోషంగా ఉంటే బీఆర్ఎస్ నాయకులకు నిదపట్టడం లేదని వ్యాఖ్యనించారు. మహబూబ్‌నగర్ జిల్లాపై పగబట్టి అభివృద్దిని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు.
లగచర్ల ప్రజలు మాయగాళ్ల మాటలు విని కేసుల్లో ఇరుక్కొవద్దని సూచించారు. కోడంగల్‌లో పారిశ్రామిక వాడ ఏర్పాటు చేసి 25 వేల మంది స్థానికులకు ఉద్యోగాలు కల్పిస్తామని తెలిపారు.