Saturday, September 6, 2025
spot_img

రేవంత్ మెడకు ‘నేషనల్ హెరాల్డ్’ ఉచ్చు

Must Read

ఇప్పటికే దేశంలో అత్యధిక క్రిమినల్ కేసులు నమోదైన ముఖ్యమంత్రిగా పేరొందిన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తాజాగా మరో కేసులో చిక్కుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మంట్ డైరెక్టరేట్(ఈడీ) తన ఛార్జ్‌షీట్‌లో రేవంత్ రెడ్డి పేరును చేర్చింది. యంగ్ ఇండియా సంస్థకు విరాళాలు ఇస్తే పదవులు ఇప్పిస్తానని రేవంత్ రెడ్డి ప్రలోభ పెట్టాడని ఈడీ అభియోగపత్రంలో పేర్కొంది.

రేవంత్ రెడ్డితోపాటు కాంగ్రెస్ నాయకుడు పవన్ బన్సల్, దివంగత నేత అహ్మద్ పటేల్ పేర్లను సైతం ఈడీ ఛార్జ్ షీట్‌లో చేర్చింది. అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్(ఏజేఎల్)కు చెందిన రూ.2000 కోట్ల ఆస్తులను కాజేయడానికి, కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ యంగ్ ఇండియా సంస్థను ఏర్పాటుచేశారని తెలిపింది.

యంగ్ ఇండియా సంస్థ ఏర్పాటుకు 2019–22 మధ్య కాలంలో విరాళాల రూపంలో డబ్బులు వసూలు చేసి, పదవులు ఇప్పిస్తామని రేవంత్ రెడ్డి ఆశచూపాడని ఈడీ ఆరోపించింది. సాక్షులను విచారించిన తర్వాతే రేవంత్ రెడ్డి పేరును అభియోగపత్రంలో చేర్చామని స్పష్టం చేసింది. రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకుల సూచన మేరకే విరాళాలు ఇచ్చామని సాక్షులు విచారణలో తెలిపారని ఈడీ వివరించింది.

Latest News

కేంద్ర ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం

పేద, మధ్యతరగతి, రైతులు, మహిళలు, యువతకు మేలు చేసేలా జీఎస్టీ రేట్ల తగ్గింపు సంస్కరణలు. బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పి రవి ప్రసాద్ గౌడ్ దేశవ్యాప్తంగా...
- Advertisement -spot_img

More Articles Like This