టీడీపీ అధినేత చంద్రబాబు మనవడు నారా దేవాన్ష్ పుట్టినరోజు.. సందర్భంగా నారా కుటుంబ సభ్యులు తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్నారు. నారా లోకేష్, భువనేశ్వరి, బ్రహ్మణి, దేవాన్ష్ శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాన్ష్ ప్రతి పుట్టిన రోజున తిరుమలలో ఒక్కరోజు అన్న వితరణకు అయ్యే ఖర్చు టిటిడి అన్నప్రసాదం ట్రస్ట్‌కు లోకేష్ విరాళమిచ్చారు. ఉదయం అన్నప్రసాద సముదాయంలో యాత్రికులకు అల్పాహారాన్ని వడ్డించారు. శుక్రవారం ఉదయం చంద్రబాబు కుటుంబంతో కలిసి తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. తర్వాత వెంగమాంబ అన్నదాన వితరణ కేంద్రంలో కుటుంబసభ్యులతో కలిసి ప్రసాదాలు పంపిణీ చేశారు. దేవాన్స్ కూడా భక్తులకు అన్న ప్రసాదాల పంపిణీ చేశారు. దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా అన్న ప్రసాదాలకు ఒకరోజు అయ్యే ఖర్చును టీటీడీ అన్నదాన ట్రస్ట్‌కు చంద్రబాబు విరాళంగా అందజేశారు. కాగా దేవాన్ష్ బర్త్ డే సందర్భంగా ప్రతి ఏడాది తిరుమలలో ఒక్క రోజు అన్నదానానికి అయ్యే ఖర్చును చంద్రబాబు కుటుంబం విరాళంగా అందజేస్తున్న సంగతి తెలిసిందే.









