Friday, September 20, 2024
spot_img

మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రేషియా

Must Read
  • గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం ప్రకటించిన కేంద్రమంత్రి అశ్విని వైష్ణన్
  • స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేల ఎక్స్ గ్రేషియా
  • అధికారులు తెలిపిన వివరాల ప్రకారం ప్రమాదంలో 15మంది మృతి
  • సుమరుగా 150 మందికి గాయాలు
  • మృతి చెందిన వారిలో గూడ్స్ రైలు డ్రైవరు,అసిస్టెంట్ డ్రైవరు

పశ్చిమ బెంగాల్ లోని రంగపాణి స్టేషన్ సమీపంలో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్ గ్రెషియా ప్రకటించారు కేంద్రమంత్రి అశ్విని వైష్ణన్.ప్రమాదంలో గాయపడిన వారికి రూ.2.5 లక్షల పరిహారం ప్రకటించారు.ఉదయం సీల్డా నుంచి కాంచనజంగా వెళ్తున్న ఎక్స్ప్రెస్ ను గూడ్స్ రైలు ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందగా సుమరుగా 150 మందికి పైగా ప్రయాణికులు గాయపడినట్టు అధికారులు తెలిపారు.మృతి చెందిన వారిలో గూడ్స్ రైలు డ్రైవరు,అసిస్టెంట్ డ్రైవరుతో పాటు కాంచన్ జంగా రైలు గార్డ్ కూడా ఉన్నట్టు రైల్వే బోర్డు ఛైర్మన్,సీఈఓ జయ వర్మ సిన్హా తెలిపారు.గాయపడిన వారిని సిలిగుడి లోని ఉత్తర బెంగాల్ లోని మెడికల్ కళాశాలకి తరలించమని పేర్కొన్నారు.స్వల్ప గాయాలైన ప్రయాణికులకు రూ. 50 వేలు ఎక్స్ గ్రేషియా ప్రకటిస్తునట్టు కేంద్రమంత్రి అశ్విని వైష్ణన్ పేర్కొన్నారు.ప్రమాదానికి గల కారణాలను పరిశీలిస్తున్నామని తెలిపారు ఈశాన్య సరిహద్దు రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ సబ్యసాచి.కొన్ని రైళ్లను దారి మళ్లించినప్పటికీ, అలుబారి-సిలిగురి-న్యూ జల్‌పైగురి లైన్ ఉన్నందున రాకపోకలకు ఎలాంటి ఇబ్బంది ఉండదు అని వెల్లడించారు.

Latest News

బీఆర్ఎస్,బీజేపీ పార్టీలకు బీసీల గురించి మాట్లాడే హక్కు లేదు

వెనుకబడిన వర్గాల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు నా కార్యవర్గంలో 60 శాతం మందికి ఎస్సీ,ఎస్టీ,బీసీలకు అవకాశం కల్పిస్తా రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని,అధిస్థానం కోరిన...
- Advertisement -spot_img

More Articles Like This