- 18 ఎకరాల ప్రభుత్వ స్థలం ఎక్కడుందో తెలియని పరిస్థితి..
- కోర్టు వివాదంలో ఉన్న 543 సర్వే నెంబర్ కు హుడా పర్మిషన్ ఎలా ఇస్తారు..?
- 27 ఎకరాలకు బ్లాస్టింగ్ అనుమతి తీసుకొని, 123 ఎకరాలలో బాంబుల మోతతో ప్రజల ప్రాణాలు తీస్తున్నారు..
- ఏ క్షణం ఏరాయి ఏ ఇంట్లో పడుతుందో తెలియని దారుణ పరిస్థితి..
- పర్యావరణ పరిరక్షణ శాఖ అనుమతులు లేకుండానే గుట్టలను మాయం చేస్తున్న వైనం..
- మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతంకు, ఆర్డీవో, తహసీల్దార్‌లకు పట్టింపు లేదా..?
- పోలీసులకు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసిన చర్యలు శూన్యం..
- అక్రమార్కులపై చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏంటి..?
- ఆవేదన వ్యక్తం చేస్తున్న డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలో ఉంటున్న మహిళలు..
- బాధితులు చనిపోతేకాని ప్రభుత్వం కళ్ళ తెరవదా..?
ఘట్‌కేసర్ మండల కార్యాలయానికి కూత వేట దూరంలో ప్రధాన రహదారి పక్కనే ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన గట్టు మైసమ్మ దేవాలయం వెనుక ఉన్న గుట్టను మాయం చేస్తున్న మైనింగ్ మాఫియా..! స్పెషల్ ఆపరేషన్ టీం, పోలీస్ నిఘా విభాగం, రెవెన్యూ యంత్రాంగం, జిల్లా కలెక్టర్ వ్యవస్థ కాంగ్రెస్ హయాంలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా..?
కాంగ్రెస్ పాలనలో అసలు వ్యవస్థలు పనిచేస్తున్నాయా..? లేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నాయా..? అర్ధం కానీ పరిస్థితి నెలకొంది.. సాక్షాత్తూ మైసమ్మ తల్లి సాక్షిగా అనుమతులను మించి బ్లాస్టింగులు చేస్తున్న మాఫియాను కట్టడి చేయడంలో ఎందుకు అలసత్వం ప్రదర్శిస్తున్నారు..? దీనికి పాలకవర్గం, ఉన్నతాధికారులు జవాబు చెప్పగలరా..? నిరుపేద మహిళల ఆవేదన కనిపించడం లేదా..? వారి రోదనలు అరణ్యరోదనలు గానే మిగిలిపోవాల్సిందేనా..? ఘట్‌కేసర్ ప్రాంతంలో నెలకొన్న భయంకర పరిస్థితిపై ఆదాబ్ అందిస్తున్న ప్రత్యేకం కథనం..

గట్టు మైసమ్మ దేవాలయం ఇక లేనట్టేనా..? వేలాదిమంది భక్తులకు వేదన మాత్రమే మిగిలిపోనుందా..? ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి తన వ్యాపార అభివృద్ధి కోసం దేవాలయం చుట్టూ మట్టిని తొలగించి దేవాలయం లేకుండా చేస్తున్న దుర్మార్గపు ఘటన వెలుగుచూసింది..

ఇతగాడు చేస్తున్న దారుణానికి రాబోయే వర్షాకాలంలో భారీ వర్షాలు కురిస్తే, మట్టి జారిపోయి పైన ఉన్న పెద్దపెద్ద రాళ్లు జారిపోయి టెంపుల్ నేలమట్టం అయ్యే ప్రమాద పరిస్థితులు కనిపిస్తున్నాయి.. ఇదిలా ఉంటే ప్రస్తుతం గట్టు మైసమ్మ దేవాలయం వెనుక ఉన్న సర్వే నెంబర్ 543 ఉన్న భూములు అన్నీ కోర్టు వివాదంలో ఉన్నాయి.. కానీ ఇవేమీ చూడకుండా హెచ్ఎండిఏ అధికారులు కళ్లకు గంతలు కట్టుకొని గుడ్డిగా అనుమతులు జారీ చేశారు..
ఓవైపు ప్రభుత్వ స్థలం.. మరోవైపు కోర్టు పరిధిలో కేసు.. వీటికి మించి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రజల ప్రాణాలు.. ఈ క్రమంలో పెద్దపెద్ద బాంబులు, డీడీలు, జిలిటేన్ స్టిక్స్ వంటి ప్రమాదకరమైన ఏపీలోసివ్స్ తో బండరాలను పేల్చేందుకు వినియోగిస్తున్నారు.. దీంతో పక్కనే ప్రభుత్వం కట్టించిన డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివసిస్తున్న ప్రజలు ఎప్పుడు ఏ ప్రమాదం, ఎటువైపు నుంచి వస్తుదో..? ఏ రాయి మా తలపై పడుతుందో..? మా ప్రాణాలు ఎప్పుడు గాల్లో కలుస్తాయో..? అని ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బ్రతుకుతున్నాం అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు స్థానిక ప్రజలు..

పర్యావరణ శాఖ అనుమతులు ఎక్కడ..?
మేము నిర్మాణం చేయడం లేదు.. కేవలం ల్యాండ్ లెవెలింగ్ చేసుకుంటున్నాం అంటూ ప్రభుత్వ అధికారులకు టోకరా వేసి.. లేఔట్ సృష్టించి.. 500, 1000 గజాల చొప్పున ఫ్లాట్లను అమ్మేస్తూ.. ఆ నిర్మాణాలకు అనుమతులు క్లియర్ గా ఉన్నాయంటూ.. అమాయక ప్రజలను మోసం చేస్తున్నారు ” నీసిజా ఇన్ఫ్రా డెవలపర్ ” యాజమాన్యం వారు.. కాగా ప్రస్తుతం ప్లాట్లు కొనుగోలు చేసిన వారంతా భవిష్యత్తులో ఇండ్ల నిర్మాణం చేయాలంటే పర్యావరణ శాఖ అనుమతులు లేకుండా ఎలా చేస్తారో అన్నది అర్ధంకాని ప్రశ్న..
ఇక లక్షలు, కోట్లు పెట్టి కొన్న స్థలాల యజమానులు అనుమతుల కోసం ప్రభుత్వ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరగాల్సిందేనా..?అన్నది ఇప్పుడు ఉత్పన్నం అవుతున్న సందేహం..
బాంబుల మోతతో ప్రాణాలు పోవాల్సిందేనా..?
ఈ క్షణం ఏ బాంబు పేలుతుందో, ఏ రాయి ఏ ప్రాణం తీస్తుందో..? బ్రతకాలంటే బంధాలు వదిలించుకోవాల్సిందేనా..? ఇక్కడ ఉంటే ప్రాణాలు పోవాల్సిందేనా..? బంధం కన్నా బ్రతుకుతెరువు కన్నా పేగు తెంచుకు పుట్టిన పిల్లల ప్రాణాలే ఫణంగా పెట్టి బయటికి వెళ్లి బ్రతకాలనుకుంటున్నాం.. ఇక్కడ ఉంటే ఈ క్షణమైనా చావాల్సిందే.. గట్టు మైసమ్మ ఆలయం వెనుక డబల్ బెడ్ రూమ్ ఇండ్లలో నివాసం ఉంటున్న అమాయక మహిళల ఆవేదన ఇది..
ఘట్‌కేసర్ తహసిల్దార్ వివరణ :
సర్వే నెంబర్ 543లో అక్రమంగా వెంచర్ చేస్తున్నారంటూ ఫిర్యాదులు వచ్చాయి.. అంతే కాకుండా మైనింగ్ అనుమతులు లేకుండా బ్లాస్టింగ్ నిర్వహిస్తున్నారు అనేది ఈ మధ్య మా దృష్టికి వచ్చింది.. అదీకాక చుట్టుపక్కల ప్రజలకు ప్రమాదం ఉందని స్థానికులు తెలిపారు. ఏదేమైనప్పటికీ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అని వివరణ ఇవ్వడం జరిగింది..
నీసిజా ఇన్ఫ్రా డెవలపర్ అక్రమాలపై మరిన్ని పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు తీసుకురానుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం.. అవినీతిపై అస్త్రం..