ఎన్నికల సంఘం ప్రకటన విడుదల
బిహార్ ఎన్నికల జాబితా నుంచి 51 లక్షల పేర్లు తొలగించినట్టు ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు ప్రకటించింది. ఓటర్లు మరణించడం, వలస వెళ్లడం ఇందుకు కారణాలుగా తెలిపింది. ముసాయిదా ఎన్నికల జాబితాలో అర్హులైన ఓటర్లను చేరుస్తామని హామీ ఇచ్చింది. ఆగస్టు 1న జాబితాను అధికారికంగా ప్రకటిస్తామని ఒక ప్రకటనలో తెలిపింది.ఈ మేరకు ఎన్నికల కమిషన్ ఒక నోట్ విడుదల చేసింది.
ఇంతవరకూ నిర్వహించిన బిహార్ స్పెషల్ ఇన్టెన్సివ్ రివిజన్ (ఎస్‌ఐఆర్)లో 18 లక్షల మంది ఓటర్లు చనిపోయినట్టు తమ దృష్టికి రాగా, 26 లక్షల మంది వివిధ నియోజకవర్గాలకు షిప్ట్ అయ్యారని, రెండుచోట్ల పేర్లు నమోదు చేసుకున్న వారు 7 లక్షల మంది ఉన్నారని వివరించింది. బిహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో రాజ్యాంగ బాధ్యతగా ఎస్‌ఐఆర్‌ను నిర్వహిస్తున్నామని ఈసీ తెలింది. ఎస్‌ఐఆర్‌పై ఈసీ తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం కోర్టు పరిశీలనలో ఉండగా, తాము చేపట్టిన పక్రియ చట్టబద్ధమని, రాజ్యాంగంలోని 324వ నిబంధనకు లోబడి ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఎన్నికల కమిషన్ చెబుతోంది.