Thursday, August 14, 2025
spot_img

త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయడమా ! ఆవిష్కరించడమా ?

Must Read

ఆగష్టు 15 నాడు 79 వ స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా….

రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యవాదుల నుండి భారతదేశం 1947 ఆగష్టు 15 నాడు స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని పొందింది.ప్రతి సంవత్సరం ఆగస్టు 15 నాడు బ్రిటిష్ పాలన నుండి మన దేశం స్వాతంత్య్రం పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగి ఎగురవేస్తారు.తర్వాత వివిధ రాష్ట్రాల సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.ఆగష్టు 15 నాడు స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా మన దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోటలో ప్రధాన మంత్రి, రాష్ట్రాలలో ముఖ్యమంత్రులు రాష్ట్రాల రాజధానులలో తెలంగాణ రాష్ట్రంలో గోల్కొండ కోటలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి మువ్వెన్నెల జెండా ఎగురవేయడం జరుగుతుంది.

భారత రత్న డాక్టర్.బి.ఆర్.అంబేద్కర్ చే రచింపబడిన రాజ్యాంగం 26 జనవరి 1950 నాడు అమలు లోకి వచ్చింది.ప్రతి సంవత్సరం జనవరి 26 నాడు గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.జనవరి 26 నాడు జెండా పై భాగాన కట్టి పైకి లాగకుండా విప్పుతారు.దీనినే ఆవిష్కరించడం అంటారు.మన దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్ పథ్ లో రాష్ట్రపతి వివిధ రాష్ట్రాల రాజధానులలో ఆ రాష్ట్రాల గవర్నర్లు మన తెలంగాణ రాష్ట్రంలో సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్లో తెలంగాణ రాష్ట్ర గవర్నర్ త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరిస్తారు.

మన దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 78 సంవత్సరాల స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా స్వాతంత్య్ర‌ దినోత్సవ ఉత్సవాలను ఘనంగా నిర్వహించడానికి దేశ వ్యాప్తంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఈ నాటి విద్యార్థులకు, యువతరానికి స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల ప్రాధాన్యత తెలియజేయాల్సిన అవసరం, ఆవశ్యకత తల్లిదండ్రులపై, ఉపాధ్యాయులపై, స్వచ్ఛంద సంస్థలపై, పత్రిక యాజమాన్యం పై ఎంతైనా ఉంది.
ఈ రోజులలో బుక్ కల్చర్ పోయి లుక్ కల్చర్ రావడం, ఆంగ్ల వ్యామోహం పెరగడం, కంప్యూటరీకరణ వలన స్వాతంత్య్ర‌ దినోత్సవ, రిపబ్లిక్ దినోత్సవ ( గణతంత్ర దినోత్సవ) ప్రాధాన్యత తెలియడం లేదు. స్వాతంత్య్ర‌ దినోత్సవాన్ని, గణతంత్ర ( రిపబ్లిక్ ) దినోత్సవాన్ని జాతీయ పర్వదినాలుగా, జాతీయ పండుగలుగా జరుపుకోకుండా సెలవుదినాలుగా గడిపేయడం ఆందోళన కరమైన విషయం.

స్వాతంత్య్ర‌ దినోత్సవ, గణతంత్ర ( రిపబ్లిక్ ) దినోత్సవ వేడుకల సందర్భంగా ఎగరవేసే త్రివర్ణ పతాకాన్ని మన తెలుగు రాష్ట్రాలకు చెందిన పింగళి వెంకయ్య రూపొందించడం మన దేశ వ్యాప్తంగా తెలుగు రాష్ట్రాలకు ఎంతో గర్వకారణం.ప్రతిజ్ఞ తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన పైడిమర్రి సుబ్బారావు రాయడం ఎంతో గర్వకారణం. మన దేశం రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ పాలకుల పాలనలో మగ్గిన తరువాత అనేక మంది స్వాతంత్య్ర‌ సమరయోధులు పోరాటాలు, ఉద్యమాలు, త్యాగాల ఫలితంగా స్వాతంత్య్రాన్ని సాధించగలిగాము.

గాంధీ, నెహ్రూ లాంటి శాంతి యోధులు, భగత్ సింగ్, చంద్రశేఖర్ ఆజాద్, సుభాష్ చంద్రబోస్ ( నేతాజీ ), అల్లూరి సీతారామరాజు,అస్పఖ్ ఉల్లాఖాన్, ఉదంసింగ్ లాంటి విప్లవ యోధులు, ఝాన్సీ లక్ష్మీబాయి, రుద్రమదేవి వంటి వీర వనితలు ఎంతో మంది తమ ప్రాణాలను, ఆస్తులను, అంతస్తులను, భవిష్యత్తును లెక్కచేయకుండా వివిధ పద్ధతుల్లో ముఖ్యంగా శాంతి, అహింస, విప్లవ పద్దతుల్లో వీరోచితంగా, విరామం లేకుండా తుపాకీ గుళ్ళకు, లాఠీ దెబ్బలకు, జైలు శిక్ష లకు భయపడకుండా ప్రాణాలను తృణప్రాయంగా భావించి చేసిన పోరాటాలు, ఉద్యమాల ఫలితమే ఈ రోజు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ, స్వాతంత్య్రం.

ఈనాటి విద్యార్థులకు ఆంగ్ల మాధ్యమంలో విద్యాబోధన చేసి విదేశాలకు వెళ్లి డాలర్ లోకంలో విహంగ వీక్షణ చేయడం తప్ప దేశభక్తి, దేశం పట్ల గౌరవం, దేశం పట్ల ప్రేమ, ఆప్యాయత, అనురాగం, ఆత్మీయత, అభిమానం, అనుబంధం లేకపోవడం విచారించదగిన విషయం. మనదేశంలో ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో కొన్ని ప్రయివేటు విద్యా సంస్థలు,కళాశాలలు, పాఠశాలలు సెలవు దినం గా ప్రకటిస్తున్నారు.తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థుల ర్యాంకులు, మార్కులు, విదేశీ చదువులు, విదేశాల్లో ఉద్యోగాల మీద పెట్టిన శ్రద్ధ దేశభక్తి మీద పెట్టడం లేదు. స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా దేశ నాయకుల చిత్ర పటాలను అడిగితే ఎవరికి అర్థం కావడం లేదు. ఒక ఎలక్ట్రానిక్ మీడియా స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా సాప్ట్ వేర్ ఉద్యోగులను అడిగితే సెలవు దినమనే చెబుతున్నారు.సాప్ట్ వేర్ లలో స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకలను జరపడం లేదు. స్వాతంత్య్ర‌ దినోత్సవ ప్రాధాన్యత తెలియకుండా డిగ్రీ లు పూర్తి చేసి బి.టెక్ లు చేసి ఉద్యోగాలు చేస్తుండడం గమనార్హం.కొంతమంది ఆర్టీసీ బస్సు కండాక్టర్ లు ప్రభుత్వ, పంచాయతీ రాజ్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను సెలవు దినం అని అనుమతించడం లేదు.ఈ వ్యాస కర్త డాక్టర్.ఎస్. విజయ భాస్కర్ ఆర్టీసీ కండాక్టర్ లతో ఈ రోజు సెలవు దినం కాదు జాతీయ పర్వదినం అని గత సంవత్సరం లో చెప్పడం జరిగింది.పై అధికారుల నుండి స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా విద్యార్థులను అనుమతించాలని ఉత్తర్వులు జారీ కాలేదని చెప్పారు.ఈ వ్యాస రచయిత ఆర్టీసీ డిపో మేనేజర్ లను కలిసి, ఆర్టీసీ సంబంధిత అధికారులను కలిసి ఉత్తర్వులు జారీచేపించారు.

కుల మత ప్రాంత వర్ణ వర్గ తేడా లేకుండా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ఎన్నో ఉద్యమాలు, పోరాటాలు చేసి సాధించుకున్న స్వాతంత్య్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ముఖ్యంగా విద్యార్థుల మీద ఎంతైనా ఉంది. స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా దేశ భక్తి గీతాల ద్వారా, విద్యా సంస్థలలో స్వాతంత్య్ర‌ దినోత్సవ సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, దేశ భక్తి గీతాల పోటీలు నిర్వహించి విద్యార్థులలో దేశభక్తి ని పెంపొందించాలి.

  • డాక్టర్. ఎస్. విజయ భాస్కర్, 9290826988

Latest News

పాకిస్థాన్ రాకెట్‌ ఫోర్స్‌ ఏర్పాటు

‘ఆపరేషన్‌ సిందూర్‌ భారత్‌’ క్షిపణుల దెబ్బ తిన్న పాకిస్థాన్‌ ఇప్పుడు కొత్త రాకెట్‌ ఫోర్స్‌ను ఏర్పాటు చేయబోతోంది. బుధవారం అర్ధరాత్రి జరిగిన కార్యక్రమంలో ఆ దేశ...
- Advertisement -spot_img

More Articles Like This

error: Contact AADAB NEWS