- మాదక ద్రవ్యాల భరతం పడుతున్న పోలీసులు…!!
- సహాకార చర్యల ద్వారా నశా ముక్త్ :రాష్ట్ర డీజీపీ డాక్టర్ జితేందర్
సరదా సరదా అలావటు….పట్టుకుంటే వదలని దురలవాటు…కుటుంబ సభ్యులు,స్నేహితుల, ఆరోగ్యానికి చేటు..ఆపై క్యాన్స్‌ర్ కాటు…వద్దు ఇక చెప్పోద్దు అంటారా .? అయితే ఇకనైనా వేద్ధాం గంజాయి రవాణ అడ్డుకట్టకు ఒక అడుగు. ఆరోగ్యపరంగా తతెత్తుతున్న సమస్యలకు 50 శాతం గంజాయి, సిగరెట్లు తగడం ఒక కారణం అవుతుంటే..క్యాన్స్‌ర్లకు 50 శాతం మత్తు పదార్థాల సేవించడం కూడా ఒక కారణమాట. చాలామందికి ఈ విషయాలు తెలిసిన కూడా, మానేయాలని ప్రయత్నించి విఫలం అవడం మనచుట్టు ఉన్న వారిలో చూస్తుంటాం. వీరి పరిస్థితి ఇలా ఉంటే ఎప్పటికప్పుడు కొత్తతరం వారు వచ్చి ఇందులో చేరిపోతుండటం ఆందోళన కలిగిస్తుంది. యువత పక్కాదారి పడుతు చిన్న వయస్సులోనే గంజాయి,మాదక ద్రవ్యాలు సేవించడం అలవాటుగా మారుతుందని అధ్యయనాలు స్నష్టం చేస్తున్నాయి.
మొదట్లో సరదగా మొదలై, క్రమంగా అలవాటుగా మారుతుందని సర్వేలు వెల్లడిస్తున్నాయి. జీవితం చప్పగా సాగిపోకూడదు. ఏదో ఒక అలవాటుండాలి అప్పుడే లైఫ్ జాలీగా సాగిపోతుంది. నా వైపు చూసి నేర్చుకో అంటూ గంజాయి బాబులు గుప్పు గుప్పున పోగ వదులుతూ, చెప్పే గిరీశాలు ప్రస్తుత సమాజంలో కోకోల్లలు. ఇదే సమయంలో కుటుంబ సభ్యుల్లో సఖ్యత లేకపోవడం, పాశ్చాత్య సంసృతి ప్రభావంతో ఎక్కువమంది గంజాయి వైపు ఆకర్షితులవుతున్నాట్లు మత్తు సేవిస్తున్న బాబుల మాటలను బట్టి తెలుస్తోంది.
మత్తు నుండి రాష్ట్రాన్ని విముక్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించడంతో వెంటనే రంగంలోకి దిగిన పోలీసుల శాఖ మార్పులు చేర్పులు చేస్తే మత్తు పదార్థాల, మాదక ద్రవ్యాల రవాణకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుని (తెలంగాణ పోలీస్ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో) వింగ్ ను ఏర్పాటు చేశారు. దీంతో రాష్ట్రం మొత్తం మీదా ఇలాంటి యూనిట్‌లను ఏర్పాటు చేసి మత్తు పదార్థాల అక్రమ రవాణ, సమర్ధ వంతగా అడ్టుకుంటు అధిక మొత్తంలో వాటిని స్వాధీనం చేసుకుని నిందితులకు జీవిత కాలపు శిక్షలు పడేలా చేస్తున్నారు.
గంజాయి రవాణ, మత్తు పదార్ధల సేవణ, మాదక ధ్రవ్యాల నిర్మోలన అంశపై రాష్ట్ర పోలీసులు అనుసరిస్తున్న తీరుపై ఆదాబ్ అందిస్తున్న ప్రత్యేక కథనం…!!
డ్రగ్స్ పై పోరాటం..!
తెలంగాణ రాష్ట్ర పోలీసులు మత్తు పదార్థల రవాణను సమర్దవంతంగా అడ్డుకుంటు ముందుకు సాగుతున్నారు. ఎప్పటికప్పుడు సాంకేతికత అంశాలను సద్వీనియోగం చేసుకుంటు నిందితులకు శిక్షలు పడేలా చేస్తున్నారు. రాష్ట్రంలోని ఏ జిల్లాలో కూడా మత్తు పదార్థాలు, గంజాయి రవాణ లేకుండా చూడడం టీ.జీఏ.ఏన్.బి. విభాగం విధి. ఇక్కడ విధులు నిర్వహించే సిబ్బంది తమ ప్రణాళికలు ఎప్పటికప్పుడు అమలు పరుచుకుంటు మత్తు పదార్థల తరలించే వారి భరతం పడుతున్నారు. రాష్ట్ర మొత్తం మీద దాదాపు 22,654 మంది పోలీసులు, అభార్కి శాఖ, మరియు రైల్వే శాఖ సిబ్బందికి 14 ప్రత్యేక శిక్షణ కోర్సుల ద్వారా ఎన్.డీ.పీ.ఎస్ చట్టం అమలు పద్దతులపై శిక్షణ ఇచ్చారు. ఇందులో దాదాపు 56 బ్యాచ్‌లు 6.టీజీపీఏ వద్ద నిర్వహించారు. అధికారులు ఎన్.డీ.పీ.ఎస్ చట్టాన్ని సమర్థంగా అమలు చేసేందుకు ఆరు డిటైల్‌డ్ గైడ్స్‌ను ప్రచురించారు. అంతేకాకుండా కోర్టు డ్యూటీ అధికారులకు ముఖ్యమైన ప్రక్రియలపై శిక్షణ సాక్ష్యాల నిర్వహాణ బెయిల్ పిటిషన్‌లకు వ్యతిరేకంగా వాదన, మరియు కోర్టు ట్రయాల్స్ నిర్వహాణలో శిక్షణ ఇచ్చారు.
కేసుల తీర్పుతో కీలక విజయాలు..!
నార్కోటిక్ డ్రగ్స్ అదుపు పోరాటంలో తెలంగాణ పోలీసులు కీలక విజయాలను సాధించారు. 2024సవంత్సరంలో ఎన్.డీ.పీ.ఎస్. చట్టం కింద తీర్పుల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదైంది. ఈ సంవత్సరంలో 226 కేసుల్లో విచారణకు రావగా 39 కేసులు తీర్పుతో ముగిశాయి. ఇది గత సంవత్సరాతో పోలిస్తే చాలా మెరుగైన ఫలితం. మహాబుబాద్, భద్రాది కొత్తగూడెం, వరంగల్, ఖమ్మం, సైబరాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, కరీంనగర్ యూనిట్లు ఈ ప్రక్రియలో ప్రత్యేకమైన ప్రదర్శన చూపాయి.
తీర్పులు ఇలా..!
- 04కేసుల్లో 17మంది దోషులుగా తేలారు. దీంతో వారికి న్యాయస్థానం 20 సంవత్సరాలు జైలు శిక్షణ విధించింది
- ఓ కేసులో ఇద్దరికి 12 సంవత్సరాల శిక్ష పడింది.
- 11కేసుల్లో ఉన్న 19 మంది నిందితులకు 10 సంవత్సరాల శిక్ష పడింది
- ఒక కేసులో నిందితుడికి 5 సంవత్సరాలు శిక్ష పడింది
- ఒకే కేసులో ఉన్న ముగ్గురికి 1సంవత్సరం శిక్ష పడింది
- నెలల్లో 02 కేసుల్లో 8మంది దోషులుగా తెలారు.
సమాకార చర్యల ద్వారా నశా ముక్త్ : డీ.జీ.పీ డాక్టర్ జితేందర్
రాష్ట్రాన్ని నశా ముక్త్ చేయడానికి పోలీసులు శాయశక్తుల కృషిచేస్తున్నారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ల దర్యాప్తు అధికారులు, పర్యవేక్షణ అధికారుల సమన్వయంతో నేరాల దర్యాప్తు ట్రయాల్స్‌ను సమర్థవంతగా నిర్వహించేందుకు ప్రత్యేక వర్కషాప్ ఇచ్చారు. తెలంగాణ పోలీసులు మాదక ధ్రవ్యాలకు వ్యతిరేకంగా తమ కట్టుబాడును మరోసారి పునరుద్ఘాటించారు. న్యాయాన్ని సమర్థవంతగా అమలు చేస్తు నశా ముక్త్ తెలంగాణ సాధన వైపు నడుస్తున్నారని ఆయన పేర్కోన్నారు.