తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఎక్కడ చూసిన ప్రజలు చలితో గజగజ వణికిపోతున్నారు. ఉత్తర, మధ్య తెలంగాణలో చలి తీవ్రత ఎక్కువగా ఉందని అధికారులు తెలిపారు. రాత్రి సమయంలో 15 డిగ్రీలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల కంటే కుమ్రంభీం అసిఫాబాద్ జిల్లాలో అత్యంత కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి.అదిలాబాద్ జిల్లా బేలలో 09.09 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తూర్పు, ఈశాన్య ప్రాంతాల నుంచి రాష్ట్రం వైపు గాలులు వీస్తుండటమే చలి తీవ్రత పెరగడానికి కారణమని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు.
హైదరాబాద్ నగరంలో కూడా చలి తీవ్రత ఎక్కువగా ఉంది.గరిష్ట, కనిష్ట ఉష్ణోగ్రతలు రెండు దారుణంగా పడిపోయాయి. రాత్రి సమయంలో చలి తీవ్రతతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు.