మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి శివసేన అధినేత ఏక్నాథ్ షిండే రాజీనామా చేశారు. ముంబైలోని రాజ్‌భవన్ లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కి తన రాజీనామ పత్రాన్ని అందజేశారు. మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు ఏక్నాథ్ షిండే అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతారు.
ఇటీవల మహారాష్ట్రలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించింది. 288 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసి, 235 స్థానాలను కైవసం చేసుకుంది. ఇదిలా ఉండగా, మహారాష్ట్ర తదుపరి సీఎం ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతుంది. దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి రేసులో ఉన్నారు. బిజెపి అధిస్థానం కూడా దేవేంద్ర ఫడ్నవిస్ కు సీఎంగా అవకాశం ఇచ్చేందుకు ఆమోదం తెలిపిందని మీడియాలో జోరుగా కథనాలు వస్తున్నాయి.