నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం కొనసాగుతుంది. రానున్న 06 గంటల్లో ఇది తుఫానుగా మరే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తుఫాను ప్రభావంతో ఏపీలోనీ పలు జిల్లాలో భారీ వర్షాలు కూరుస్తాయని తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం ప్రభావంతో నెల్లూర్, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. అన్నమయ్య,చిత్తూర్ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో భారీ నుండి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ప్రకాశం, సత్యసాయి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ కోస్తా తీరం వెంబడి 45 నుండి 55 వరకు గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణశాఖ తెలిపింది. ఏపీలోని అన్ని పోర్టులలో ఒకటవ నంబర్ ప్రమాద హెచ్చరికలు జారీ చేశామని విశాఖ తుఫాను హెచ్చరిక కేంద్రం స్పష్టం చేసింది.
నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం నెమ్మదిగా కదులుతూ తూర్పు ఈశాన్యంగా 100 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని వాతావరణశాఖ పేర్కొంది. వాయుగుండం రేపు తీరం దాటే అవకాశం ఉంది. గంటకు 09 కిలోమీటర్ల వేగంతో ఫెంగల్ కదులుతున్నట్లు అధికారులు తెలిపారు.