సినీ నటి సమంత ఇంట్లో విషాదం నెలకొంది. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు అనారోగ్యంతో కన్నుమూశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ సమంత తన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది. “మనం మళ్లీ కలిసే వరకు నాన్న” అంటూ హార్ట్ బ్రేక్ ఏమోజీని సమంత జత చేశారు. సమంత తండ్రి జోసెఫ్ ప్రభు ఆంగ్ల ఇండియన్.చిన్ననాటి నుండే సమంత తండ్రి కెరీర్ లో ముఖ్యపాత్ర పోషించాడు.
సమంత తండ్రి చనిపోయిన వార్త తెలుసుకున్న పలుపురు ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా ద్వారా తమ సంతాపం ప్రకటిస్తున్నారు.