తిరుమలలో రాజకీయ, ద్వేషపూరిత ప్రసంగాలను టీటీడీ నిషేదించింది. తిరుమలలో మీడియాను ఉద్దేశించి ప్రజాప్రతినిధులు రాజకీయ ప్రకటనలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. తిరుమల ఆలయం పరిసరాల పవిత్రతను, ఆధ్యాత్మిక ప్రశాంతతను కాపాడేందుకు ఈ చర్య అవసరమని టీటీడీ పేర్కొంది.