ఫెంగల్ తుఫాను ప్రభావంతో చెన్నైలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. చెన్నై ఎయిర్పోర్ట్ లో భారీగా వరద నీరు వచ్చి చేరింది. ఈ క్రమంలో చెన్నై ఎయిర్పోర్ట్ను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.సేఫ్ ల్యాండింగ్ విమానాల మినహా, అన్ని విమాన సర్వీసులను రద్దు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం తుఫానుగా మారింది. పుదుచ్చేరి, తమిళనాడు తీరాల వైపు బలంగా దూసుకొస్తున్న ఫెంగల్ తుఫాను మరికొన్ని గంటల్లో తీరాన్ని తాకే అవకాశం ఉంది. దీంతో తమిళనాడు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా చెన్నైలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి