ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప 02 డిసెంబర్ 05న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఈ మెరకు శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. డిసెంబర్ 04న రాత్రి 9.30 గంటల నుండి బెన్ఫిట్ షోలతో పాటు అర్ధరాత్రి 01 షోలకు అనుమతి ఇచ్చినట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.
పుష్ప 02 బెనిఫిట్ షోల టికెట్ ధరలు రూ. 800 ఖరలు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా సింగిల్ , మల్టీపెక్స్ లో బెనిఫిట్ షోలకు ఈ ధరలు వర్తిస్తాయి. డిసెంబర్ 05 నుండి 08 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.150, మల్టీప్లెక్స్ లో రూ.200లకు టికెట్ ధరను పెంచారు. డీసెంబర్ 09 నుండి 16 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.105, మల్టీప్లెక్స్ లో రూ.150 పెంపునకు అనుమతి ఇచ్చారు. ఇక డిసెంబర్ 17 నుండి 23 వరకు సింగిల్ స్క్రీన్ లో రూ.20 మల్టీప్లెక్స్ లో రూ.50 చొప్పున పెంచుకునేందుకు మేకర్స్‌కి వెసులుబాటు కల్పించింది.