రంగారెడ్డి జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇబ్రాహీంపట్నం మండలం రాయపోల్ గ్రామానికి చెందిన మహిళా కానిస్టేబుల్ నాగమణి హత్యకు గురయ్యారు. సోమవారం ఉదయం విధులకు వెళ్తున్న నాగమణిని సోదరుడు కారుతో ఢీకొట్టి వేట కొడవలితో దాడి చేసి హతమార్చాడు. నవంబర్ 01న నాగమణి శ్రీకాంత్‌ను ప్రేమ వివాహం చేసుకుంది. వివాహం అనంతరం వీరిద్దరూ హయాత్‌నగర్‌లో నివాసముంటున్నారు. నాగమణి ప్రేమ వివాహం చేసుకోవడం సోదరుడు పరమేష్ కి ఏ మాత్రం ఇష్టం లేదు.
ఈ క్రమంలోనే కక్ష పెంచుకున్న సోదరుడు పరమేష్ నాగమణి విధులకు వెళ్తుండగా నాగమణిని కారుతో ఢీకొట్టి వేట కోడవలితో దాడి చేసి హత్యమార్చాడు.