పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వాయిదాల పర్వం కొనసాగుతుంది.
గౌతం ఆదానీ అవినీతి, సంభాల్‌లో చెలరేగిన హింస తదితర అంశాలపై చర్చ జరపాలంటూ ప్రతిపక్షలు పట్టుబట్టడంతో ఉభయ సభల సమావేశాలకు అంతరాయం కలుగుతుంది. సోమవారం కూడా పార్లమెంట్ లో ఇదే పరిస్థితి కొనసాగింది.
సోమవారం ఉదయం 11 గంటలకు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆదానీ, సంభాల్‌లో జరిగిన హింసాకాండపై చర్చకు విపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి.విపక్షాల ఆందోళనలతో సభలను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేస్తున్నట్లు లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధన్ఖర్ ప్రకటించారు. తిరిగి సమావేశాలు ప్రారంభం కాగానే విపక్షాలు మళ్లీ నిరసన తెలిపాయి. పార్లమెంట్ సమావేశాలు సజావుగా జరిగేందుకు సహకరించాలని విపక్ష సభ్యులను లోక్‌సభ స్పీకర్, రాజ్యసభ ఛైర్మన్ కోరారు. విపక్షాల ఆందోళనలతో ఉభయసభలను రేపటికి వాయిదా పడ్డాయి.