మహారాష్ట్ర అపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే అస్వస్థతకు గురయ్యారు. గతకొన్ని రోజులుగా అయిన జ్వరంతో బాధపడుతున్నారు. మహారాష్ట్ర సీఎం పదవి ఎంపిక, మంత్రి పదవుల కేటాయింపు, తదితర అంశాలపై బిజెపి పెద్దలతో చర్చించేందుకు అయిన సోమవారం ముంబైకి చేరుకున్నారు. తాజాగా మంగళవారం షిండే ఆరోగ్యం క్షీణించడంతో అయినను థానేలోని ఓ ఆసుపత్రికి తరలించారు.
మరోవైపు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. మహారాష్ట్ర నూతన సీఎంగా బిజెపి నేతను ఎంపిక చేసినట్టు సమాచారం.ఇందుకు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు అంగీకారం తెలిపినట్లు తెలుస్తుంది.
డిసెంబర్ 05న ముంబైలోని ఆజాద్ మైదాన్‌లో ముఖ్యమంత్రి ప్రమాణస్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి.