ఓ మనిషి….?
చివరి మజిలీలో నీతో వచ్చేవి ఏంటో నీకు తెలుసా ..?
భార్య ఇంటి గుమ్మం వరకు, బిడ్డలు కట్టె కాలే వరకు,
బంధువులు స్మశానం వరకు,
కానీ నీ మంచితనం నీవు అస్తమించినా..
ఉదయించే సూర్యునిలా రోజు ప్రకాశిస్తుంది.
నీ బ్రతుకు ఎలా ఉండాలంటే…
నీ పేరు చెప్తే జనం చెయ్యెత్తి మొక్కాలి..
నీ మరణం ఎలా ఉండాలంటే దేహం కాలిబూడిదైనా నలుగురు గొప్పగా చెప్పుకునేలా నీ జీవితం..
ఉండాలి…నీ చివరి మజిలీలో స్మశానం కూడా కన్నీరు పెట్టాలి…!
అలా బ్రతకాలిరా ఓ మనిషీ..
- బాటసారి