జనగామ జిల్లా కేంద్రంలో టీఎన్జిఓ నూతన భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమానికి స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గం ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జనగాం జిల్లా గ్రంధాలయ చైర్మన్ మారుజోడు రాంబాబు, లింగాల ఘనపూర్ మాజీ జడ్పీటీసీ గుడి వంశీధర్ రెడ్డి, మార్కెట్ వైస్ చైర్మన్, మండల అధ్యక్షులు కొల్లూరి శివ కుమార్ హాజరయ్యారు. అనంతరం వారు కొబ్బరికాయ కొట్టి సంఘం ప్రతినిధులుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బొల్లంపల్లి నాగేందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షులు లోకుంట్ల ప్రవీణ్, జిల్లా కార్యదర్శి దామేరా నాగరాజు, పాక్స్ డైరెక్టర్లు వేముల కృష్ణారెడ్డి, గుర్రం బాలరాజు, బత్తిని అశోక్ కుమార్ గౌడ్, బుషిగంపల ఆంజనేయులు, బస్వగాని అనిల్, ఉప్పల మధు తదితరులు పాల్గొన్నారు.